Advertisementt

స్పైడర్ అస్సలు రాజీ పడడంలేదట..!

Fri 30th Jun 2017 04:03 PM
murugadoss,mahesh babu,spyder movie,dussehra  స్పైడర్ అస్సలు రాజీ పడడంలేదట..!
Spyder Movie Release on Dussehra స్పైడర్ అస్సలు రాజీ పడడంలేదట..!
Advertisement
Ads by CJ

మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ చిత్రం మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పటి వరకు చిత్రం షూటింగ్ ఒక కొలిక్కిరాలేదని అంటున్నారు. కారణం మురుగదాస్ ఏ విషయంలోనూ సంతృప్తి పొందకపోవడమే అంటున్నారు. అసలు తన  సినిమాల  విషయంలో దేనిలోనైనా మురుగదాస్ తీరు ఇలాగే వుంటుందట. తాను అనుకున్నదే కానీ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడని డైరెక్టర్ గా మురుగదాస్ కి పేరు. అందుకే ఇప్పుడు మహేష్ హీరోగా రూపొందుతున్న స్పైడర్ విషయంలోనూ మురుగదాస్ అదే పద్దతి ఫాలో అవుతున్నాడట.అందుకే ఇప్పటి వరకు స్పైడర్ చిత్రం షూటింగ్ పూర్తికాలేదని అంటున్నారు.

ఇక ఈ విషయంలో మహేష్ కు ముందు కొంచెం కోపం వచ్చినప్పటికీ మురుగదాస్ మీదున్న నమ్మకంతోనే తన డేట్స్ అడ్జెస్ట్మెంట్ కూడా చేశాడట. అయితే ఇప్పుడు స్పైడర్ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కమిట్ అవ్వడంతో  షూటింగ్ ని కాస్త జోరుగా చేస్తున్నారట. ఇకపోతే క్లైమాక్స్ విషయంలో రాజీపడని మురుగదాస్ ఇప్పుడు పాటల విషయంలోనూ అస్సలు రాజీ పడడంలేదట. ఇంకా మిగిలిన రెండు సాంగ్స్ లో ఒక్కోదానికి వారం పది రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తున్నాడట. మరి రెండు పాటలకే ఒక నెల సమయం పడుతుండడంతో ఈ సినిమా కోసం మహేష్ మళ్లీ కొన్ని డేట్స్ ఇవ్వాల్సి వచ్చిందట.

ఇక సినిమా షూటింగ్ , పాటల షూటింగ్ మొత్తం జులై ఆఖరి వారానికి కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ మీద ఫోకస్ పెడతారట. అసలు  ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు కొన్ని నెలల ముందు నుంచే  జరుగుతున్నాయట.మరి షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ అంతా పూర్తి చేసేసి దసరాకి  విడుదల డేట్ కే స్పైడర్ తో  పక్కాగా రావాలని చిత్ర యూనిట్ సమాయత్తమవుతుందట.

Spyder Movie Release on Dussehra :

The film unit will be ready to complete the shooting, visual effects, graphic work and come with Dussehra's release date k spyder.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ