Advertisementt

హరీష్ కి మెగా అవకాశం చేజారినట్టేనా.?

Fri 30th Jun 2017 01:08 PM
chiranjeevi,harish shankar,dj movie,allu arjun,missed chance harish to chiranjeevi  హరీష్ కి మెగా అవకాశం చేజారినట్టేనా.?
Director Harish Shankar's missed Chance Chiranjeevi Film హరీష్ కి మెగా అవకాశం చేజారినట్టేనా.?
Advertisement
Ads by CJ

హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం గత శుక్రవారమే విడుదలై మిక్స్డ్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. అల్లు అర్జున్ - పూజ  హెగ్డే జంటగా వచ్చిన డిజె చిత్రం మొదటి షో కే ప్లాప్ టాక్ మూట గట్టుకుంది. కానీ అల్లు అర్జున్ క్రేజ్ వలెనే 'దువ్వాడ జగన్నాథం' చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని బయట బాగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కి సంబంధం లేదనేగా ఆ ప్రచారానికి అర్ధం. ఇక హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ పిలిచి 'గబ్బర్ సింగ్' వంటి చిత్రానికి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా హరీష్ కెరీర్ ని బాగా మలుపు తిప్పింది. 

ఇక పవన్ ని కూడా 'గబ్బర్ సింగ్' టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో నిలబెట్టింది. కానీ హరీష్ కి 'గబ్బర్ సింగ్' తర్వాత కాలం కలిసిరాలేదు. ఇప్పుడు డిజె తో అయినా మళ్లీ నిలదొక్కుకుంటాడనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడూ సీన్ రివర్స్ అయినట్టే కనబడుతుంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ 'సుబ్రహ్మణ్యం ఫర్ సెల్' ఆడియో టైం లో చిరంజీవి హరీష్ తో ఒక సినిమా చెయ్యాలని ఉందని అన్నాడు. ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాలలో వింటూనే ఉంటాం. అంటే ఏదైనా సినిమా ఆడి ఫంక్షన్ లోనో ఆ సినిమాకి సంబందించిన మరేదైనా ఫంక్షన్ లో గెస్టులుగా వచ్చిన వారు ఆ సినిమా డైరెక్టర్ ని పొగిడేపనిలో నీతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చేస్తుంటారు. అలాగే చిరు కూడా హరీష్ తో సినిమా చేస్తానని చెప్పాడు.

ఇక హరీష్ శంకర్ కూడా డిజె ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ నా దేవుడు ఆయన నా మదిలో ఎప్పుడు మెదులుతూనే ఉంటాడు అని చెప్పి పనిలో పనిగా.....  చిరు గారితో సినిమా కూడా ఆలోచిస్తున్నానని... కథ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. అంటే డిజె సూపర్ హిట్ అవుతుంది. ఇక డిజె హిట్ తో మెగా క్యాంప్ లో ఎలాగైనా భారీ ప్రాజెక్ట్ పట్టాలని కలలుకన్నాడు హరీష్. కానీ ఇప్పుడు డిజె ఫలితంతో హరీష్ శంకర్ కి ఆ మెగా అవకాశం చేజారినట్లే అని చెబుతున్నారు మెగా ఫ్యాన్స్.

Director Harish Shankar's missed Chance Chiranjeevi Film:

Dairector harish shankar directed movie Dj is already release and this movie negetive talk. Chiranjeevi told i like harish shankar direction and he acting a movie under harish shankar direction but DJ movie result harish shankar mised chance to chiranjeevi movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ