ప్రస్తుతం మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్' చిత్రంపై రోజు రోజుకూ ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబర్ చివర్న తెలుగుతో పాటు తమిళంలో స్ట్రెయిట్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా మురుగదాస్ వల్ల ఈ చిత్రానికి తమిళంతో పాటు హిందీలో కూడా క్రేజ్ ఏర్పడుతోంది. దాంతో బాలీవుడ్ హక్కులు ఏకంగా 20కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మరోపక్క ఏడాడి కిందట విడుదలైన ఈ చిత్రం టైటిల్ నుంచి టీజర్ వరకు ఫస్ట్‌లుక్‌తో సహా అన్ని అనుకున్న తేదీ కంటే చాలా ఆలస్యంగా వచ్చాయి. కానీ లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా రావడం, వాటికి అభిమానుల నుంచే గాక రాజమౌళి వంటి ప్రముఖుల వరకు అందరిని అలరించడంతో మహేష్ అభిమానులు ఆనందంగా ఉన్నారు.
ఇక తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అంటే మే 31న తన సినిమాకు సంబంధించిన ఏదో ఒకటి రిలీజ్ చేసే సెంటిమెంట్ మహేష్‌కి ఉన్నందున మహేష్ బలవంతం మీదే కేవలం ఈ చిత్రం టీజర్‌ని షూట్ చేసి వదిలారట. ఈ సన్నివేశం సినిమాలో ఉండదని, కేవలం టీజర్ కోసం ప్రత్యేకంగా తీసిందేనట. ఇక విడుదలకు మరో మూడు నెలల దాకా టైం ఉండటం అభిమానులకు కాస్త నిరుత్సాహం కలిగిస్తోంది. అయితే టీజర్‌లోనే ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లకు ఎంత ఇంపార్టెన్స్ ఉండనుందో దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతృప్తి చెందుతున్నారు.
ఆగష్టు9న మహేష్‌బాబు బర్త్‌డే కానుకగా ఈ చిత్రం థియేటికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేస్తారని, సెప్టెంబర్ మొదటి వారంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వేర్వేరుగా ఆడియోను రిలీజ్ చేస్తారని అంటున్నారు. కాబట్టి మరీ ఎక్కువ విరామం ఉన్నందువల్ల సినిమాపై అంచనాలు తగ్గకుండా ఉండేందుకు త్వరలో రెండో టీజర్‌ని విడుదల చేసే ఉద్దేశ్యంలో యూనిట్ ఉందిట. రెండో టీజర్ మాత్రం సినిమాలోని సీన్స్‌నే ఉంచి కట్ చేస్తారని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.