తన సోదరుడు భరత్ రాజుతో తనకు 30ఏళ్ల అనుబంధం ఉందని, అలాంటి భరత్ శవాన్నితాను చూడలేనని భావించి, కడ చూపు కూడా చూడలేదంటే రవితేజలోని సున్నిత హృదయం ఎలాంటిదో అర్ధమవుతుంది. ఎంత దుర్మార్గుడైనా కూడా అన్నా అన్న తర్వాత నాన్న తర్వాత నాన్న వంటివాడు. కానీ కొరివి పెట్టడానికి కూడా ఆయన రాలేదు. ఎందరు విమర్శించనీ గాక సున్నిత హృదయులు తమ మద్య ఉన్న బంధం, అనుబంధాలను గుర్తుచేసుకుని తమతో చిన్నప్పటి నుంచి పెరిగిన రక్తం పంచుకుని పుట్టిన సోదరులను అనాధలుగా వదిలేయగలరే గానీ తీవ్ర గాయాలతో నుజ్జునుజ్జైన శరీరాన్ని, విగతజీవిగా పడి ఉన్న సోదరుని తట్టుకుని చూసి నిబ్బరంగా ఉండటం జరిగే పనికాదు.
ఎవరో దూరంగా చనిపోతేనే, మనకేం సంబంధం లేకపోయినా బాధపడే వారికి అదే నిజ జీవితంలో ఎదురుకావడం బాధాకరం. కొంత మందైతే డిప్రెషన్‌కి లోనై, ఎవ్వరితోనూ కలవరు. ఎవ్వరికీ మొహం చూపించరు. కానీ రవితేజ తన షూటింగ్ ఆగిపోతే నిర్మాతకు ఎంత నష్టం.. ముఖ్యంగా పలువురు ఆర్టిస్ట్‌లతో కలిసి చేయాల్సిన సీన్స్ అంటే మరలా తాను షూటింగ్‌కి వచ్చినప్పుడు మిగిలిన వారు ఖాళీగా ఉంటారని చెప్పలేం. దాంతో రవితేజ తాజాగా దిల్‌రాజు - అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రాజా ది గ్రేట్' షూటింగ్‌కు హాజరై శ్రీనివాసరెడ్డితో సహా నవ్వుతూ ఓ సెల్ఫీ దిగాడు. మొత్తానికి ఈ చిత్రం ప్రారంభమైన తర్వాత అటు దిల్‌రాజు భార్యను, ఇటు రవితేజ సోదరుడిని కోల్పోవడం బాధాకరం.