నేడున్న యంగ్ హీరోలలో నానిది డిఫరెంట్ స్టైల్, మరీ ఓవర్ బడ్జెట్‌తో సినిమాలు చేయాలని నిర్మాతలకు కండీషన్ పెట్టడు. తనకోసం స్టార్ హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల కోసం రికమెండేషన్స్ చేయడు. కథ నచ్చి, దర్శకుడి మీద బాగా తీయగలడనే నమ్మకం, నిర్మాత సినిమాను నిలబెట్టి, ప్రమోషన్స్ చేయగలిగితే చాలు మినిమం బడ్జెట్‌తో కానిచేస్తాడు. తన రెమ్యూనరేషన్‌ని కూడా మిగిలిన వారిలా డిమాండ్ సప్లై విధానంలో గాక చూసిచూడనట్లు పోతుంటాడు.
అలాగే నిర్మాతలకు ఓ ఐదారు కోట్లు మిగిలేలా, లేదా సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు, బయ్యర్లు సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఒకే చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ చెప్పి, ఏడాదంతా వారికే డేట్స్ దారాదత్తం చేయడం కంటే ఎక్కువ సినిమాలు స్పీడ్‌గా, వేస్టేజ్ లేకుండా తీయడానికి మక్కువ చూపుతాడు. కాబట్టే అతను ఎవరి అండదండలు లేకుండా నేచురల్ స్టార్ కాగలిగాడు. ఇక దిల్‌రాజు రూట్ అందరికీ తెలిసిందే, దర్శకునికి ఏమి కావాలి? ఎవరు కావాలి? అనేవన్నీ ఆయన సమకూరుస్తాడు.
కాగా ప్రసుత్తం నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రాన్ని నాని-దిల్‌రాజు- వేణు శ్రీరాంలు చేస్తున్నారు. ఇందులోని ఓ కీలక పాత్రను ఓ బాలీవుడ్ నటుడి చేత చేయించాలని దర్శకుడు భావించాడు. దానికి దిల్‌రాజు ఓకే చెప్పాడు. అతనెవరో కాదు.. హైదరాబాద్‌లో థియేటర్ ఆర్ట్స్ చేసి 'పింక్' చిత్రంలో తనదైన నటనతో బాగా ఆకట్టుకున్న విజయ్ వర్మ. ఆయన దర్శకుడు వేణుశ్రీరాం తనకు కథను నేరెట్ చేయగానే ఇంప్రెస్ అయి ఓకే చెప్పేశాడట.
ఇతను ప్రస్తుతం తనకు తెలుగు రాదని, అందుకే దానిని ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయాభాషలను నేర్చుకోవడం పట్ల ఆయన తన మక్కువ చూపిస్తున్నాడు. ఈ చిత్రం హిట్టయితే టాలీవుడ్‌కి మరో విలక్షణ నటుడు దొరికినట్లేనని చెప్పాలి.