Advertisementt

ఆ..నలుగురిలో మరో సారి చేయి కలిపిన ఆ ఇద్దరు!

Thu 29th Jun 2017 01:59 PM
dilraju,suresh babu,rana,sai dharam tej,jawan movie,nene raju nene manthri movie  ఆ..నలుగురిలో మరో సారి చేయి కలిపిన ఆ ఇద్దరు!
Suresh Babu Has Now Joined Hands With Dilraju ఆ..నలుగురిలో మరో సారి చేయి కలిపిన ఆ ఇద్దరు!
Advertisement
Ads by CJ

మన తెలుగుసినీ రంగంలో ఆ..నలుగురు అనే పేరు బాగా పాపులర్‌. ఎవరినోట విన్నా ఆ నలుగురి గురించే సంభాషణ. విచిత్రం ఏమిటంటే.. మిగిలిన వారికి ఈ నలుగురు మింగుడు పడకపోయిన తమ చిత్రాల విషయానికి వస్తే ఆ.. నలుగురు తమలో తాము చేయి కలిపి, ఒకే మాట..ఒకే బాటగా వెళ్లడం ఈమద్య తరుచుగా జరుగుతోంది. అల్లు అరవింద్‌-దిల్‌రాజులు ఎప్పుడు చేయికలుపుతూనే ఉంటారు. దిల్‌రాజు చేసే చిత్రాలలో అత్యధికం మెగాఫ్యామిలీ చిత్రాలే. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు శిరీష్‌కి పెద్ద హిట్‌ ఇచ్చేందుకు త్వరలో అల్లు అరవింద్‌-దిల్‌రాజులు సంయుక్తంగా ఓ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టనున్నారు. ఇక బన్నీ, సాయిలతో అయితే దిల్‌రాజుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు డిజె విషయంలో జరుగుతున్నది అదే. ఇక విషయానికి వస్తే ఆ నలుగురి మరో వ్యక్తి అయిన సురేష్‌ బాబుతో ఇప్పుడు దిల్‌రాజు చేతులు కలిపి తమ తమ చిత్రాల రిలీజ్‌ డేట్లలో మార్పులు చేర్పులు చేసుకుని తమ స్నేహాన్ని మరోసారి చాటుతున్నారు. 

ఆగష్టు11న ఇండిపెండెన్స్‌ డే సందర్బంగా లాంగ్‌ వీకెండ్‌ రావడంతో ఆ రోజు నాలుగు చిత్రాలు పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. నితిన్‌-హనురాఘవపూడి-14రీల్స్‌ల 'లై', బోయపాటిశ్రీను-బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌-రకుల్‌ప్రీత్‌సింగ్‌ల 'జయ జానకి నాయకా', సాయి ధరమ్‌ తేజ్‌ - బి.వి.ఎస్‌.రవి-దిల్‌రాజుల 'జవాన్‌', తేజ-రానా-సురేష్‌బాబుల 'నేనే రాజు నేనే మంత్రి', ఇక్కడ దిల్‌రాజు పేరు ఎందుకు వచ్చిందంటే 'జవాన్‌'కి ఆయన సమర్పకునిగా వ్యవహరిస్తున్నాడు. 

దాంతో ఈ పోటీ వద్దని భావించిన దిల్‌రాజు, సురేష్‌ బాబులు ఓ అండ్‌స్టాడింగ్‌కి వచ్చినట్లు సమాచారం. దీంతో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ముందుకు వచ్చి ఆగష్టు 4న, 'జవాన్‌' ఒక వారం వెనక్కి వెళ్లి ఆగష్టు 18న విడుదల చేసి సోలోగా రావాలని ఆ ఇద్దరు ఫిక్స్‌ అయ్యారు. 

Suresh Babu Has Now Joined Hands With Dilraju:

Dilraju and Suresh Babu have come to understanding. 'Nene Raju Nene Manthri'  film came forward and on August 4th, and 'Jawan' film went backone week and release on august 18th.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ