'డిజె' సినిమా హిట్టా, ఫ్లాపా? అనేది పక్కనపెడితే ఈ సినిమా రివ్యూలు, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్‌పై ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది. తాజాగా హరీష్‌శంకర్ మాట్లాడుతూ, 'గబ్బర్‌సింగ్' నుంచి తన యాటిట్యూడ్ మారలేదని, తన యాటిట్యూడ్ వల్లే 'గబ్బర్‌సింగ్' వచ్చిందన్నాడు. ఇక ఫ్లాష్‌బ్యాక్ వెళ్లితే హరీష్‌శంకర్ 'గబ్బర్‌సింగ్' విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో, ఫంక్షన్లలో ఏం మాట్లాడాడో కాస్త గుర్తుకుతెచ్చుకుంటే మంచిది, పవన్ కళ్యాణ్‌తో మాట్లాడటం ఓ వ్యసనం లాంటిదని గణేష్‌తో పాటు హరీష్ చెప్పాడు.
ఈ షూటింగ్ సమయంలో పవన్‌ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయనకు ఉండే పనిమీద శ్రద్ద ఎక్కడా చూడలేదని, ఆయన ప్రభావం తనలో చాలా మార్పులు తెచ్చిందని, ఏ హీరోకి ఎలా పనిచేయాలి? అనే విషయంలో తన ఆలోచనావిధానంలో చాలా మార్పులు వచ్చాయన్నాడు. మరి ఈ రోజు కాదు కాదంటున్నాడు. ఇక రివ్యూలపై మండిపడుతూ ఎవరివో రివ్యూలపై ఆధారపడి సినిమాకు వెళ్లాలా? లేదా? అని నిర్ణయించుకోవద్దని, ఆడియో, ట్రైలర్, టీజర్‌లను బట్టి ఎవరికి వారు సొంతంగా రివ్యూలు రాసుకోవాలని సెలవిచ్చాడు.
వాట్ ఎన్ ఐడియా సార్...! తాజాగా తీసుకుంటే మహేష్ నటించిన 'బ్రహ్మూెత్సవం', 'కబాలి', 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు', ఇంకా ముందుకెళ్తే దిల్‌రాజు- హరీష్‌శంకర్‌లు కాంబినేషన్‌లోనే వచ్చిన కళాఖండం 'రామయ్యా..వస్తావయ్యా' చిత్రం ఆడియో,టీజర్లు చూసి ఇదేదో మంచి ఎంట్‌టైన్‌మెంట్ చిత్రమని అనుకుని, ఆ సినిమా టైటిల్ కూడా క్యాచీగా ఉందని ఆ సినిమాకు వెళ్లిన వారి పరిస్థితిఏమిటి? 'బ్రహ్మూెత్సవం' పోస్టర్స్, టీజర్ నుంచి ఇదేదో మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లాగా మరో 'సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు' లా ఉంటుందని బుక్ అయిన వారు ఎంత మంది లేరు? ఇక 'సర్దార్‌గబ్బర్‌సింగ్'ను మరో గబ్బర్‌సింగ్ అనుకుని వెళ్లినవ వారి పరిస్థితి ఏమిటి?.
'కాటమరాయడు'లాంటి పవర్‌ఫుల్ టీజర్‌ని, ట్రైలర్‌ని మనం ఎన్నిసార్లు చూసి ఉంటాం? మరి సినిమా పరిస్థితి ఏమిటి? దిల్‌రాజుపై ఉన్న క్రెడిబులిటీ, నమ్మకం మీద అందునా ఆయన రివ్యూలపై మండిపడి తనకు తానే రేటింగ్‌ల మీద నమ్మకంతో కృష్ణాష్టమిని చూసి పారిపోయిన ఆడియన్స్‌కు,తన తప్పై పోయిందని దిల్‌రాజు టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాడా? హరీష్,దిల్‌రాజు, బన్నీలు మరీ ముఖ్యంగా బన్నీ చెప్పను బ్రదర్ అని అనేసి ఇప్పుడు మాత్రం మీ నెగటివ్‌ను నా పాజిటివ్‌తో దాటేస్తానని చెప్పి మరింతగా అందరిని కెలకడందేనికి బ్రదర్..?