ఒకప్పుడు తన సినిమా అనే కాదు ఏ సినిమా వేడుకకైనా చిరంజీవి వస్తే ప్రాంగణం హోరెత్తిపోయేది. వారం ముందు నుంచే చిరు ఎవరి వేడుకు వస్తున్నాడు? ఆ హీరో ఫంక్షన్‌కే ఎందుకు వస్తున్నాడు? అనే ఆసక్తి మొదలై, ఇతర సినిమాల ఫంక్షన్లకు హాజరైతే ఆ సినిమాకి మెగా ఓపెనింగ్స్ ఉపయోగపడేవి.దాంతో అందరూ తమ వేడుకకు ఎలాగైనా చిరుని రప్పించాలని, సినిమాలలో కూడా చిరు పేరు, మెగాభిమానుల క్రేజ్ వాడుకునే ప్రయత్నం చేసేవాడు.
ఆయన ఫ్యాన్స్ గా సినిమాలలో పాత్రలు చేస్తూ గట్టెక్కిన వారు కూడా ఉన్నారు. కానీ రాజకీయాలలోకి వెళ్లి మరలా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ క్రేజ్‌తగ్గిందా? అని అందరికి సందేహం వస్తోంది. తాజాగా ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ నటిస్తున్న ఎంట్రీ మూవీ 'జయదేవ్'కి ముఖ్యఅతిధిగా విచ్చేశాడు. కానీ మెగాభిమానులు మౌనంగా ఉన్నారు. మెగాస్టార్ వేడుకకు హాజరైన వెంటనే హాట్‌హాట్‌గా బిజినెస్ బజ్, పాజిటివ్ బజ్ వస్తాయని అందరూ భావించారు.
ఈవేడుకకు చిరుతో పాటు మోహన్‌బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావుల వంటి ఉద్దండులు హాజరైనా ఎవ్వరూ ఈ చిత్రం ఊసేఎత్తడం లేదు. తాజాగా ఈ సినిమా ప్రీరి లీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని నోవాటెల్‌లో జరపనున్నారు. దీనికి బన్నీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. మరి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాతనైనా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అయిన జయంత్‌సి పరాన్జీ దర్శకత్వంవహిస్తున్న ఈ 'జయదేవ్'కి ఊపు వస్తుందోలేదో చూడాలి...!