తెలుగులో టాప్ హీరోలుగా చాలా మందే చలామణి అవుతున్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వీరు చాలా సార్లు అన్నిటీలో టాప్ పొజిషన్ లోనే కొనసాగుతున్నారు. గత ఐదారేళ్లుగా టాలీవుడ్ నెంబర్ 1 హీరో రేసులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పోటీపడుతూనే వున్నారు. కానీ ఏ ఒక్కరికి ఆ టాప్ ప్లేస్ దొరకడం లేదు. తాజాగా ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 రేసులోకి బాహుబలి విజయంతో ప్రభాస్ వచ్చి చేరాడు. కానీ ఎవరూ ఆ టాప్ ప్లేస్ ని సొంతం చేసుకోలేక తంటాలు పడుతూనే వున్నారు.
మరి ఆ టాప్ ప్లేస్ పోరు అలా జరుగుతూనే ఉంటుంది కానీ... ప్రతి ఏడు అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులెవరంటూ టైమ్స్ గ్రూప్ ఓ సర్వే చేస్తుంటుంది. తాజాగా ఈ ఏడాది కూడా మోస్ట్ డిజైరబుల్ మెన్ పోల్ నిర్వహించింది టైమ్స్ గ్రూప్. ఆ పోల్‌లో జాతీయ వ్యాప్తంగా, తెలుగు రెండు విభాగాల్లోనూ మిస్టర్ వరల్డ్ - 2016గా ఎంపికైన రోహిత్ ఖండెల్వాల్ టాప్ 1 నిలిచాడు. ఇక టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు జాతీయవ్యాప్తంగా ఏడో స్థానాన్ని గెలుచుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానాన్ని కోల్పోయాడు మహేష్. గత ఏడాది మహేష్ ఆరో స్థానంతో సౌత్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు.
ఇక తెలుగు విభాగంలో మహేష్ బాబు రెండో స్థానాన్ని దక్కించుకుని వావ్ అనిపించాడు. అలాగే నేచురల్ స్టార్ నాని టాప్ 3 లో చోటు దక్కించుకుని మిగతా హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. ఇక బాహుబలిలో భళ్లాలదేవునిగా కిర్తి ప్రతిష్టలందుకుంటున్న రానా 4 వ స్థానంలో నిలవగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 5 వ స్థానంలో నిలిచాడు. అలాగే ఐదేళ్ల నుండి బాహుబలికి కష్టపడి ఈ ఏడాది పూర్తిస్థాయి విజయంతో జాతీయ స్థాయిలో కీర్తింపబడుతున్న ప్రభాస్ 6 వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక 7 వ స్థానాన్ని నాగ చైతన్య కైవసం చేసుకోగా అల్లు అర్జున్ 8 వ స్థానానికే పరిమితమైయ్యాడు. మరి 9 వ స్థానాన్ని సుధీర్ బాబు, 10 వ స్థానాన్ని నాగ సౌర్య దక్కించుకున్నారు.
అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించారో లేదో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ 10 లో ఏ స్థానంలోనూ లేకుండా పోయాడు. చిన్న హీరోల ముందు తీసివేతనా 11 వ స్థానానికి పడిపోయాడు పవన్ కళ్యాణ్. మరి ఏ హీరోకి లేని అభిమానులు పవన్ కే వున్నారు. అలాంటి పవన్ ఇలా 11 వ స్థానంలో కొనసాగడం అనేది అభిమానులకు మింగుడు పడని విషయమే.