సాధారణంగా సినిమా విడుదల కాకముందే, తాము ఆయా చిత్రాలను కొనకముందే ఆ చిత్రం ఎలా ఉంటుందో టాక్ తెలుసుకోవాలని బయ్యర్లు ఆరాటపడతారు. వారికి షూటింగ్ స్పాట్‌లో సినిమా బాగా వస్తోందా? లేదా? అని పరిశీలించే యూనిట్ సభ్యులు, ఇక ఎడిటింగ్ రూం నుంచి సినిమా టాక్ బయ్యర్లకు చేరడం మామూలైపోయింది. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా సినిమా బిజినెస్‌పై పడుతుంది. ఇక సెన్సార్ వారు సింగిల్ కట్ కూడా ఇవ్వలేదు.
మా సినిమను చూసి అభినందించారు అని డప్పుకొట్టే వారు ఎందరో ఉన్నారు. వాస్తవానికి సెన్సార్ వారు కూడా తమ అత్యాశ కొద్ది సినిమా ఎలా ఉందో టాక్ చెప్పేస్తారు. చాలా ఏళ్ల కిందట ఓ సంక్రాంతికి చిరంజీవి నటించిన 'మృగరాజు' , బాలకృష్ణ 'నరసింహనాయుడు, వెంకటేష్ 'దేవీ పుత్రడు' రిలీజ్ అయ్యాయి. ఓ జర్నలిస్ట్ మిత్రులు సినిమాలో ఏమైనా కట్స్ ఉన్నాయా? ఎన్ని కట్స్? వంటివి తెలుసుకోవడానికి సెన్సార్ ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ సెన్సార్ చేసే వారిని చూద్దాం..ఓ మాట అడుగుదాం అని ఆ జర్నలిస్ట్ సెన్సార్ అధికారులతో మాట్లాడితే.. వారు 'మృగరాజు'బాగాలేదు. 'దేవీ పుత్రుడు' కూడా జస్ట్ యావరేజ్, 'నరసింహనాయుడు' పెద్దహిట్ అని ఓపెన్‌గా చెప్పేశారు.
వారు చెప్పినట్లే జరిగింది. ఇక జులై 6న విడుదల కానున్న శ్రీదేవి 'మామ్' ని సెన్సార్‌కి పంపించారు. ఈ చిత్రం సెన్సార్‌తో పాటు సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రహ్లాజ్ నిహలాని మాట్లాడుతూ. ఈ చిత్రం అద్భుతంగా ఉంది. శ్రీదేవి నటన చూసి ఏడవని, కన్నీళ్లు రాని ప్రేక్షకుడు ఉండడు. నేను కూడా బోరున ఏడ్చేశాను. నాటి 'మదర్ ఇండియా'లోని నర్గీస్ నటన కంటే శ్రీదేవి 100రెట్లు బాగా చేసిందని ఆయన మీడియాకే ఓపెన్‌గా చెప్పేశాడు? సెన్సార్ చేయమంటే ఏకంగా రివ్యూ ఇచ్చిన ఆయనపై బాలీవుడ్ మేకర్స్ పీకల్లోతు కోపంతో ఉన్నారు? మరి బాగాలేకపోతే ఆమాట బయటకు చెప్పేస్తే నిర్మాత పరిస్థితిఏమిటా? అనే కనీసజ్ఞానం లేని వారిని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియకుండా ఉంది...!