నేటి నిర్మాతల్లో దిల్‌రాజు రూటే సపరేటు. కాగా ఈయన 'డిజె'తో 25వ చిత్రం పూర్తి చేశాడు, నేటి రోజుల్లో 25 చిత్రాలంటే మామూలు విషయం కాదు. కానీ ఆ ఫీట్‌ని దిల్‌రాజు చేతల్లో చేసి చూపాడు.ఇక దిల్‌రాజు ఆమద్య దర్శకులు, హీరోలు సహకరిస్తే హాఫ్‌సెంచరీ కొడతానని, కానీ సెంచరీ నా వల్ల కాదన్నాడు. ఇక దిల్‌రాజు ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో చిత్రాలు నిర్మించాడు.
ఇక తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా 'ఫిదా' చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం జులై 21న విడుదలకానుంది. మరో పక్క ఆమద్య మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తన రీఎంట్రీలో దిల్ రాజు నిర్మాతగా ఆయన బేనర్‌లో ఖచ్చితంగా ఓ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. దాంతో ప్రస్తుతం కేవలం సినిమాలపైనే చిరంజీవి ఫోకస్ పెట్టడం వల్ల దిల్‌రాజు బేనర్‌లో చిరుఓ చిత్రం చేయడం ఖాయం. ఇక మొదటి నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మహా ఇష్టం. ఆయన నటించిన చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దాదాపు ఎప్పుడు ఆయనే దక్కించుకుంటాడు. ఇక తాజాగా పవన్ - త్రివిక్రమ్‌ల మూవీని కూడా 20కోట్లకు పైగా వెచ్చించి నైజాంకు హక్కులు కొన్నాడట ఇక ఇదే పవన్ ఆఖరి చిత్రమని, ఆయన త్రివిక్రమ్ సినిమా తర్వాత త్వరలో రానున్న ఎలక్షన్లపై దృష్టి పెడతాడని, ఇక ఒకే పట్టాలుపైన నడుస్తాడని వార్తలు వస్తున్న నేపధ్యంలో దిల్‌రాజు కంగారుపడి త్రివిక్రమ్-పవన్ సినిమా సెట్స్‌కి వెళ్లి కలిశాడట.
సార్..ఇక నుంచి మీరు రాజకీయాలలో బిజీ అయి సినిమాలు చేయరని అంటున్నారు. మరి నా సంగతేమిటి? అని అడిగాడట. దాంతో పవన్ అవ్వన్నీ వినవద్దు. మంచి కథను తీసుకొనిరా.. నాచేత కథ ఓకే చేయించుకో.. నీకనవసరం.. నేను నీకు సినిమా చేస్తున్నాను అన్నమాట విన్నతర్వాత దిల్‌రాజు కుదుటపడ్డాడట. కొందరు పవన్ అభిమానులేమో 'గోపాల గోపాల' సమయంలో డాలీ, అనిరుధ్‌లకి చాన్స్ ఇస్తానని చెప్పి నెరవేర్చుకున్న ఘనత మా హీరోది అంటుంటే.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం చూశాలేం.. దాసరి విషయంలో తెలిసింది కదా..! ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనను ఊరించి...ఊరించి.. పలు వార్తలు వచ్చేలా చేసి, ఆ డైరెక్టర్‌తో, ఈ డైరెక్టర్‌తో అని వార్తలైతే వచ్చాయి కానీ ఆయన మరణించే దాక వెయిట్ చేయిస్తూనే ఉన్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.