ఎంత ఎదిగిపోయావయ్యా.. ఓ లిటిల్ పవర్‌స్టార్!
Pawan Kalyan Son Akira Nandanపవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ దంపతులకు అకీరా నందన్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మరాఠిలో రేణూదేశాయ్ చిత్రంలో ఇతను బాలనటునిగా అలరించాడు. మరాఠిలో వచ్చిన ఈ సినిమాను రేణు తెలుగులోకి కూడా అనువాదం చేసి రిలీజ్ చేస్తానని మాట ఇచ్చింది. కానీ సినిమా థియేటర్లలో కాకుండా ఏకంగా ఈటీవీ చానెల్‌లో ప్రసారమైంది. అందులో బుల్లి అకీరా కనిపించాడు. పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఆ కుర్రాడు ఎలా ఉంటాడా? అని అందరూ ఆ రోజు టీవీలో సినిమా చూశారు.
ఆ సినిమాలో బుడ్డోడిగా ఉన్న అకీరానందన్ తాజాగా ఆమె తల్లి చెల్లితో కలిసి తీయించుకున్న ఫొటో వైరల్ అవుతోంది. అమ్మకన్నా హైట్‌గా, మంచి పర్సనాలీటీతో అతను కనిపిస్తుండటం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఇంతలోనే ఎంతగా ఎదిగాడు? అనిపిస్తోంది. ఇక ఈ ఫొటో చూసిన వారందరూ అచ్చు పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడని, లిటిల్ పవర్‌స్టార్ అని పిలుస్తున్నారు. కాగా ఇతననని మెగా ఇమేజ్‌కి దూరంగా మొదట మరాఠి చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేయాలని రేణూదేశాయ్ భావిస్తున్నట్లు ఆ రోజుల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నటునిగా రాటుదేలిన తర్వాత మాత్రమే తెలుగులో పరిచయం చేయాలనే ఆలోచనలో రేణూదేశాయ్ ఉన్నట్లు సమాచారం.
Pawan Kalyan and Renu Desai is the son of Akira Nandan is know every one. Recently, he was appearing as a child character in Renu Desai in Marathi film he is doing excellent acting.







































