Advertisementt

ఈ ఫ్రైడే హీరోస్ కి బ్లాక్‌ ఫ్రైడే..!

Tue 27th Jun 2017 02:37 PM
salman khan,allu arjun,akhil,simbu,tamanna,dj movie,tubelight,aaa,vanamagan,sivay  ఈ ఫ్రైడే హీరోస్ కి బ్లాక్‌ ఫ్రైడే..!
Black Friday For This Friday Heroes ఈ ఫ్రైడే హీరోస్ కి బ్లాక్‌ ఫ్రైడే..!
Advertisement
Ads by CJ

ఈ శుక్రవారం విడుదలైన చిత్రాలన్నింటి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. సల్మాన్‌తో పాటు ఇండో చైనా వార్‌ నేపధ్యం, సల్మాన్‌ అమాయకపు నటన, మంచి ఫీల్‌ ఉన్న లవ్‌స్టోరీ అని బిల్డప్‌ ఇచ్చిన 'ట్యూబ్‌లైట్‌' సల్మాన్‌ కెరీర్‌లోనే అతి తక్కువ ఓపెనింగ్స్‌ తెచ్చుకుని నెగటివ్‌ టాక్‌తో ముందుకెళ్తోంది. ఇక ఇదే వారం విడుదలైన 'డిజె' దువ్వాడ జగన్నాథంకు కలెక్షన్లు బాగానే ఉన్నా కూడా నెగటివ్‌ టాక్‌ బాగా వ్యాపించడంతో మంగళవారం నుంచి పరిస్థితి అర్ధమవుతుంది. 

ఇక ఇదే వారం తమిళంలోని ప్రేక్షకులు కూడా వారి చిత్రాలకు పెద్ద షాకిచ్చారు. శింబు త్రిపాత్రాభినయం అంటూ ఊదరగొట్టిన 'ఎఎఎ' చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాలో బిల్డప్‌ తప్ప విషయం లేదని తేల్చేస్తున్నారు ప్రేక్షకులు. రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో శింబుకే కాదు.. తమన్నాకి మరో ఫ్లాప్‌ వచ్చింది. ఇక ఇదే వారం విడుదలైన జయం రవి, 'అఖిల్‌'భామ సాయేషాసైగల్‌ నటించిన 'వనమగన్‌' చిత్రానికి డివైడ్‌టాక్‌ వచ్చింది. 

ఏదో టార్జాన్‌ తరహా చిత్రం చేయాలని ఆశించిబొక్క బోర్లా పడ్డాడట. దీంతో తెలుగులో 'అఖిల్‌' హిందీలో 'శివాయ్‌' వంటి ఫ్లాప్‌లతో టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఐరన్‌లెగ్‌ తెచ్చుకున్న సాయేషాకి కోలీవుడ్‌ కూడా అంతే షాకిచ్చింది. అయితే 'ఎఎఎ' కంటే కాస్త బెటర్‌గా ఉండటం ఆమెకు ఊరటనిస్తుండగా, ఈ శుక్రవారం నాటి హీరోయిన్‌, వివాదాస్పద వ్యక్తి అమలా పాల్‌కి మాత్రం ఆనందాన్నికలిగించింది. ఎందుకంటే తన పాత మొగుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పరాజయంపాలవ్వడమే. దాంతో ఆమె తన సన్నిహితులను పిలిచి ఆదివారం రాత్రి ఓ పార్టీ ఇచ్చిందట. అది విషయం...! 

Black Friday For This Friday Heroes:

The situation that has been released this Friday is no good. Salman khan acted movie Tubelight is negetive talk, Allu Arjun film DJ is also negetive talk and simbu acted movie AAA movie is same talk and akhil,tamanna,ect... heroes movies also same results.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ