ఎన్టీఆర్ స్టార్ మా ఛానల్ లో 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ షో షూట్ మొత్తం ముంబైలోనే జరుగుతుంది. ఇప్పటికే పార్టిసిపేట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీగా వున్న బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు... ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి సంబందించిన టీజర్ ని విడుదల చేసింది. మొన్నామధ్యన బిగ్ బాస్ ఫస్ట్ లుక్ తో అందరిని ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో లో చంపేశాడనుకోండి.
ఆ ప్రోమోలో ఎన్టీఆర్ అలారం మోగగానే లేచి కూర్చుని.... కప్పు కాఫీని చేతిలో తీసుకుని సిప్ చెయ్యబోతూ చుట్టూ వున్న కెమెరాలను చూసి షాక్ తిన్న ఎన్టీఆర్ 'ఓరినాయనో కెమెరాలెవరురా ఇక్కడపెట్టింది. నేను పెట్టమంది బిగ్ బాస్ హౌస్ లో రా... నా హౌస్ లో కాదు మార్చేయండి త్వరగా'.. అంటూ అల్లరి చేసేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే బిగ్ బాస్ ప్రోమోలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మరి ఈ ప్రోమోలో ఎన్టీఆర్ అదిరిపోతున్నాడని అభిమానులు చంకలు గుద్దుకుంటున్నారు. వచ్చే నెలలోలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షోకి మా ఛానల్ భారీ పెట్టుబడి పెడుతుంది. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ హోస్ట్ గా చేసే ప్రోగ్రాం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే ఈ షో కి క్రేజ్ వచ్చేలా ఉంది కదూ..!