బన్నీ నటించిన ప్రతి చిత్రానికి బ్యాడ్ రివ్యూలు, నెగటివ్ టాక్ వచ్చి మొదటి రోజే ఆయన వీరాభిమానులు కూడా పెదవి విరుస్తుంటే ఆయన చిత్రాలన్నీ స్లోగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ మంచి కలెక్షన్లు సాధిస్తుండటం ఒప్పుకోవాల్సిన విషయం. మహేష్ 'బ్రహ్మోత్సవం' , ఎన్టీఆర్ 'టెంపర్', పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు' చిత్రాలు భారీ అంచనాలతో వచ్చాయి. కానీ అన్ని నెగటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఎన్టీఆర్ 'టెంపర్' అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పెద్ద విజయం సాధించలేదు. బ్రహ్మోత్సవం కు సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోయాయి. ఇక పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్', 'కాటమరాయుడు' చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చినా ఓపెనింగ్స్ మాత్రం అదరగొట్టాయి. కానీ లాంగ్‌రన్‌లో నిలబడలేకపోయాయి.
కానీ బన్నీ నటించిన 'రేసుగుర్రం'కి మిక్స్‌డ్‌టాక్ వచ్చింది. బ్రహ్మానందం క్యారెక్టర్‌ని పక్కన పెడితే ఫ్లాప్‌టాక్ వచ్చింది. ఇక 'సన్నాఫ్ సత్యమూర్తి'ని ఆయన వీరాభిమానులు కూడా మా హీరో ఏంటి? ఈ సినిమా కథ ఏంటి? త్రివిక్రమ్ 'జులాయి'కి పెట్టిన శ్రద్ద 'సన్నాఫ్ సత్యమూర్తి'కి పెట్టలేదని, మా మాస్ హీరోకు ఇలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ పనికిరావని తేల్చారు. ఇక 'సరైనోడు'కు పరమ రొటీన్ చిత్రమని వారం ఆడితే గొప్ప అని, రొటీన్‌కే రొటీన్‌చిత్రమనే టాక్‌తో పాటు రివ్యూలు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు 'డిజె'కు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బన్నీ చిట్ చాట్‌లు, హరీష్‌శంకర్ ప్రెస్‌మీట్‌నే సక్సెస్ మీట్‌గా మార్చిన విధానం, పూజాహెగ్డే సినిమా కంటే బయట ప్రమోషన్స్‌లో హాట్‌హాట్ దుస్తులు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్‌మీడియాలో ప్రమోషన్స్ జోరు పెరిగింది. ఇక ఈ రోజు(సోమవారం) రంజాన్ కాబట్టి హౌస్‌ఫుల్సే. కానీ రేపటి నుంచి కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అందుకే ఈ రోజు భారీగా థాంక్యూ మీట్ నిర్వహించనున్నారు.