రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే భరత్ చనిపోయిన తర్వాత అందరూ వున్నా కూడా అనాధగానే వెళ్ళిపోయాడు. కారణం భరత్ సినిమాల్లో నటిస్తూ ఉన్నప్పటి నుండే డ్రగ్స్ కేసుల్లో, పోలీసులతో గొడవలు ఇవన్నీ వెరసి చెడుతిరుగుళ్లు కారణంగా రవితేజ తన తమ్ముడు భరత్ నుండి దూరంగా వచ్చేసాడు. మరి అన్ని చెడు అలవాట్లున్న భరత్ కి ఎంత చెప్పినా వినకపోయేసరికి అతని తల్లి కూడా భరత్ ని భరించే స్థితిలో లేకుండా పోయింది. ఇక ఎప్పుడూ వివాదరహితుడిగా టాలీవుడ్ లో పేరున్న రవితేజ తన తమ్ముడు వలన కలిగిన అవమానాలు వలన రవితేజ ఫ్యామిలీ మొత్తం భరత్ ని దూరం పెట్టేసారు. ఇక భరత్ కి పెళ్లయినా కూడా అతను ప్రస్తుతానికి ఒంటరి జీవితమే గడుపుతున్నాడు.
ఇప్పుడు కూడా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని ఫుల్ గా మందు కొట్టి డ్రైవ్ చేస్తున్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరగడంతో భరత్ స్నేహితులు ఈ యాక్సిడెంట్ విషయాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.. ఎలాగో విషయం మీడియాకి తెలియడం రవితేజ తమ్ముడు కారు యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ మీడియాలో కథనాలు రావడంతో విషయం మొత్తం పబ్లిక్ అయ్యింది. ఇకపోతే భరత్ యాక్సిడెంట్ తర్వాత డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. కానీ రవితేజ గాని అతని ఫ్యామిలీ గాని భరత్ ని చూసేందుకు రాలేదు సరికదా కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనకుండా గమ్మునుండిపోయారు. ఇక రవితేజ మేము చాలా దుఃఖం లో ఉన్నాం.... భరత్ ని అలా చూడలేక మేము రాలేదని... ఈ విషయాన్ని మీడియా పెద్దది చేయొద్దంటూ మొరపెట్టుకున్నాడు.
అయినా బతికున్నప్పుడు ఎంతటి శత్రుత్వం ఉన్న చనిపోయాక అయినా భరత్ విషయంలో రవితేజ అలా చేసుండకూడదు. కుటుంబంలో ఎన్ని గొడవలున్నా చనిపోయాక కూడా ఆఖరి చూపు కోసం రాకుండా సన్నిహితుల దగ్గర బాధపడటం అనేది రవితేజకి కరెక్ట్ కాదేమో. పాపం భరత్ ఒక అనాధ శవంలాగా అతని చిన్న తమ్ముడు రఘు సమక్షంలోనే అంత్యక్రియలు జరగడం అనేది బాధాకర విషయం. మరి ఇప్పటివరకు వివాద రహితుడిగా పేరున్న రవితేజ ఇప్పుడు మాత్రం ఈ అపవాదుని మూటగట్టుకుంటున్నాడు.