Advertisementt

అల్లు అర్జున్ మాట తప్పుతున్నాడా..!

Mon 26th Jun 2017 05:25 PM
allu arjun,linguswamy,allu arjun tamil debut film,duvvada jagannadham,naa peru surya naa illu india  అల్లు అర్జున్ మాట తప్పుతున్నాడా..!
Allu Arjun's debut Tamil film called off? అల్లు అర్జున్ మాట తప్పుతున్నాడా..!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్  డీజే చిత్రం గత శుక్రవారమే విడుదలై  మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. డీజే చిత్రానికి క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్స్ ఇచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఈ చిత్రం అంతా యాక్షన్ ఎంటర్టైనర్ గా  ఉండడంతో అల్లు అర్జున్ కి ఇప్పుడు ఒక పక్కా మాస్ చిత్రం చెయ్యాలనే కోరిక పుట్టిందట. ఇప్పటికే వక్కంతం వంశి డైరెక్షన్ లో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'తో సెట్స్ మీదకెళ్ళిన అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాన్ని లింగుస్వామి డైరెక్షన్ లో కమిట్ అయ్యాడు. అసలు వక్కంతం కన్నా ముందే లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా చెయ్యాల్సిన బన్నీ, లింగుస్వామి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి వక్కంతం సినిమాని లైన్ లో పెట్టాడు.

ఇక ఇప్పుడు వక్కంతం సినిమా అయ్యాక అయినా లింగుస్వామి ప్రాజెక్ట్ లోకి అల్లు అర్జున్ ఎంటర్ అవుతాడేమో అనుకున్నారంతా. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు మానసు మార్చుకున్నాడనే టాక్ వినబడుతుంది. వక్కంతం సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేసి మరో మాస్ మసాలా మూవీని పట్టాలెక్కించే పనిలో అల్లు అర్జున్ ఉన్నాడని అంటున్నారు. వక్కంతంతో చెయ్యబోయే నా పేరు సూర్య చాలా ఎమోషనల్ అండ్ యాక్షన్ సినిమా కాబట్టి, ఈసారి ఏదైనా వెరైటీ మాస్ సబ్జెక్ట్  కోసం అల్లు అర్జున్ ఎదురు చూస్తున్నాడట.

మరి మాస్ ఎంటర్టైనర్ అంటే ఏ వినాయకో, బోయపాటో బన్నీ కోసం కథని రెడీ చెయ్యాలి. మరి వారేమో ఇప్పుడు కొత్త సినిమాలు కమిట్మెంట్స్ తో కాస్త బిజీగా వున్నారు. మరి వేరే డైరెక్టర్స్ ఎవరైనా మాంచి మాస్ స్క్రిప్ట్ తో వస్తే వారితో అల్లు అర్జున్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అల్లు అర్జున్, లింగుస్వామి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసినట్లే అనిపిస్తుంది.

Allu Arjun's debut Tamil film called off?:

In what could come as a disappointment to the fans of Telugu star Allu Arjun, his much-hyped Tamil-Telugu film with director Linguswamy may have been shelved. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ