రజినీకాంత్ కేవలం కోలీవుఢ్‌కో లేక మరో వుడ్‌కో సూపర్‌స్టార్ కాదు. ఆయనను సౌతిండియన్ సూపర్‌స్టార్ అని పిలవడం కూడా తప్పే, ఆయనకు ఇండియన్ సినీ ప్రేమికులు, ప్రపంచ సినీ అభిమానుల్లో కూడా పేరు ఉంది. జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, దుబాయ్.. ఇలా ఎన్నో భాషల్లో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇక ఆయన స్టైల్ అంటే అందరూ ఎంతో ఇష్టపడతారు. ఆయన 'బ్లడ్‌స్టోన్' అనే ఇంగ్లీష్ చిత్రంలో కూడా నటించి మెప్పించాడు.
ఇక ఆయన చేసిన 'రోబో' బాలీవుడ్‌ని కూడా ఓ ఊపు ఊపింది. దాంతో రజినీకి తోడుగాశంకర్ ఉండటం, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుండటం, ఏఆర్‌రెహ్మాన్ సంగీతం, లైకా ప్రొడక్షన్స్ కనీవినీ ఎరుగని రీతిలో నిర్మిస్తూ ప్రమోషన్ చేయనుండటం, భారీ హాలీవుడ్ టీంతో గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ పనులను హాలీవుడ్ లెవల్లో సమకూరుస్తుండటం వంటి విషయాలు ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని ప్రపంచంలోని అన్నిదేశాలలో ఓ హాలీవుడ్ చిత్రం తరహాలో ప్రమోషన్ చేయనున్నారు. ఏకంగా ప్రపంచ యాత్రను చేసి ప్రమోషన్ చేయడానికి సిద్దమవుతున్నారు. దీపావళికి టీజర్, అక్టోబర్ చివరి వారంలో దుబాయ్‌లో అతిరథ మహారధులతో ఆడియో వేడుక, రజినీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న టీజర్, జనవరి 1న ట్రైలర్ విడుదల చేయనుండగా, సినిమాను జనవరి 25న రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదల చేయనున్నారు.