Advertisementt

మహేష్‌ రేంజ్‌ ఏమిటో చెప్పిన అతిలోక సుందరి!

Mon 26th Jun 2017 02:18 PM
mahesh babu,sridevi,jahnavi kapoor,tollywood,mom promotions  మహేష్‌ రేంజ్‌ ఏమిటో చెప్పిన అతిలోక సుందరి!
Sridevi is Told About Mahesh Babu Range మహేష్‌ రేంజ్‌ ఏమిటో చెప్పిన అతిలోక సుందరి!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మీద వచ్చిన న్యూస్ లు మరే ఇతర సెలెబ్రటీ పిల్లల మీద వచ్చున్డవేమో. అంతలా జాన్వీ కపూర్ మీడియాలో నానుతూ వుంది. అసలు ఆమె ఏ డ్రెస్ వేసినా సెన్సేషన్, ఆమె ఎక్కడ ఎవరితో కనబడినా సెన్సేషన్, పార్టీకి వెళ్లినా లంచ్ కి, డిన్నర్ కి వెళ్లినా అంతా న్యూసే. అలాగే సినీరంగ ప్రవేశం పై  కూడా రోజుకో న్యూస్ మీడియాలో ప్రచురితమవుతూనే వుంది. శ్రీదేవి కూడా జాన్వీ విషయంలో అతిగా శ్రద్ద తీసుకుంటుందని... ఆమెకు ఏవేవో కండిషన్స్ పెడుతుందని అబ్బో ఒకటేమిటి బోలెడన్ని వార్తలు జాన్వీ కపూర్ పై వస్తూనే వున్నాయి.

ఇక టాలీవుడ్ లో కూడా ఆ మధ్యన ఎప్పుడో మహేష్ మూవీని జాన్వీ కపూర్ రిజక్ట్ చేసిందనే ప్రచారం జరిగింది. అయితే మహేష్ సినిమాని జాన్వీ రిజెక్ట్ చేసిందనే విషయాన్ని 'మామ్' ప్రమోషన్స్ కై హైదరాబాద్ విచ్చేసిన శ్రీదేవిని మీడియా మిత్రులు ప్రశ్నించగా దానికి శ్రీదేవి భలే తమాషా సమాధానం చెప్పింది. మహేష్ బాబు సినిమాని జాన్వీ రిజెక్ట్ చెయ్యడమేమిటండి. అది నిజంగా అన్యాయమండీ... ఎవరైనా మహేష్ తో అవకాశం వస్తే వదులుకుంటారా... అసలు నాకు మహేష్ బాబు చిత్రాలంటే చాలా ఇష్టం. మహేష్ సినిమాలు ప్రత్యేకంగా చూస్తా. మహేష్ నటన, తన స్టైల్ అంటే నాకు బాగా ఇష్టం. అలాంటి మహేష్ పక్కన మా జాన్వీ నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు అలాంటి ఆఫర్ నా కూతురు జాన్వీ కపూర్ కి వస్తే మాత్రం అస్సలు వదులుకోమని చెబుతుంది.

అలాంటి మహేష్ చిత్రాన్ని జాన్వీ రిజెక్ట్ చేసిందని ఏవేవో వార్తలు, పుకార్లు పుట్టించి రాసేశారు. అసలు జాన్వీ వయసెంత చెప్పండి. ఇంకా ఒక్క సినిమా అయినా మొదలెట్టలేదు అప్పుడే మహేష్ ని రిజెక్ట్ చేసిందని రాయడం ఎంతవరకు సమంజసమండి అంటూ చమత్కరిస్తుంది. అలాగే ఇలాంటివి రాస్తే జాన్వీ కపూర్ కి ఎంత పొగరు అనుకోరు. ఇలాంటి న్యూస్ చూసినప్పుడు ఒక తల్లిగా చాలా బాధపడతానని చెబుతుంది. శ్రీదేవి చెప్పింది అక్షరాలా నిజమే కదండీ గాలి వార్తలు చదివినప్పుడు ఎవరైనా అలాగే ఫీలవుతారు కదా..!

Sridevi is Told About Mahesh Babu Range:

There was also a promotional campaign in Tollywood that Jahnavi Kapoor rejected had made a film on Mahesh's film. Sridevi is told the excellent offer is to leave my daughter, Jahnavi Kapoor, to give up.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ