ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actor Raviteja Brother Bharath Dead in Road Accident

రవితేజ సోదరుని మృతి..!

Actor Raviteja Brother Bharath Dead in Road Accident

ప్రముఖ హీరో, మాస్‌ మహారాజా రవితేజ సోదరుడు భరత్‌ హైదరాబాద్‌ రింగురోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించాడు. ఆగిఉన్న లారీని అతివేగంతో వస్తున్న లగ్జరీకారు ఢీకొట్టడంతో ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కారు ఎంత వేగంగా వచ్చిందంటే కారులోని మూడోవంతు లారీలోపలికి వెళ్లిపోయింది. రక్షణగా ఉండే బెలూన్స్‌ కూడా పేలిపోయాయి. ఈ ఘటన జరిగి దాదాపు 15గంటలైనా మృతుడిని గుర్తించలేకపోయారు. 

ఈ కారు రవితేజ, భరత్‌ల తల్లి రాజ్యలక్ష్మి పేరిట ఉంది. దాంతో మృతుడు ఎవరు అని నెంబర్‌ని బట్టి విచారించి చివరకు పోలీసులు ఛేదించగలిగారు ఇటీవలే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌ మరణం తర్వాత ఇదీ అలాగే జరిగింది. కాకపోతే నిషిత్‌ పిల్లర్‌ని ఢీకొడితే భరత్‌ ఆగి వున్న లారీని ఢీకొట్టాడు. ఒక చోట బెలూన్లు పనిచేయలేదు. కానీ భరత్‌ కారుకు బెలూన్లు పగిలిపోయాయి. కాగా భరత్‌ టాలీవుడ్‌లో కూడా సుపరిచితుడు. కొన్ని చిత్రాలలో సపోర్టింగ్‌ రోల్స్‌ చేశాడు. 

'ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్‌, వెంకీ, దూకుడు వంటి చిత్రాలలో నటించాడు. ఇక ఈయన పలు వివాదాలకు కారకుడు. డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లాడు. ఆ సందర్భంగా తనను కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా వారిపై దాడి చేశాడు. తిరుమలలో కారులో సిగరెట్‌ తాగుతూ పట్టుకున్న పోలీసులపై దౌర్జన్యం చేశాడు. దాంతో ఆయన కారు నడిపేటప్పుడు ఏమైనా మద్యం లేక డ్రగ్స్‌ తీసుకున్నాడా..? అనే యాంగిల్‌లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

In an unfortunate incident, Bhupatiraju Bharath, brother of Raviteja met with an accident and died on the spot. Bharath was driving in full speed on the outer ring road and hit a lorry that was stopped. The lorry driver has to be blamed as he didn’t take any precautions to let the other commuters know that the lorry actually broke down.

raviteja
brother bharath raju
road accident
bharath no more
bharath dead