సెటైర్లు కేవలం సినీ ప్రముఖుల, రాజకీయనాయకుల, రచయితగా కాపీ రైట్ కాదు. సెటైర్లు వేయడం జర్నలిస్ట్‌లతో పాటు సామాన్యులకు కూడా వచ్చు. ఇక సెటైర్లు వేయడంలో సల్మాన్ స్టైలే వేరు. తాజాగా విడుదలైన 'ట్యూబ్‌లైట్' పబ్లులు పగిలిపోతున్నాయని, మాడిపోతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ప్రేక్షకులు, అభిమానులు నీరసించిపోతున్నారు. అదే ప్రశ్నను అడిగిన మీడియా సల్మాన్ సెటైర్లు వేస్తున్నాడు.
ఈ చిత్రం విడుదలకు ముందే ప్రమోషన్‌లో ఆయన సినిమాకు వచ్చే రివ్యూల రేటింగ్‌లు ఎలా ఉంటాయో? గుర్తించాడు కాబోలు మీరు ఇచ్చి రివ్యూరేటింగ్‌లు తననేమీ చేయలేవని అన్నాడు. అన్నట్లుగానే దీనికి క్రిటిక్స్ 1-2లోపే రేటింగ్‌లు ఇచ్చారు. దీనిపై సల్మాన్ మాట్లాడుతూ, క్రిటిక్స్ తన విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించారని,తాను మైనస్‌లో రేటింగ్స్ ఇస్తారనుకున్నానని సెటైరు వేశాడు.
తనను ఎలా చూపినా తనను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని చెబుతూనే, నా సినిమా ఈద్‌కి రావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చారని, విజిల్, చప్పట్లు, కేకలు, పూలు.. ఇలా జరుగుతుందని, అదిరిపోయే హీరోయిజం, ఫైట్స్, డ్యాన్స్‌లు ఉంటారని వారు భావించారని కానీ సినిమా మొత్తం మనసుకు హత్తుకునే కథ కావడంతో పాటు నేను ఏడవడాన్ని ప్రేక్షకులు ఊహించుకోలేకపోయారని, దానిని జీర్ణించుకోవడానికి కొంత టైం పడుతుందని తెలిపాడు. ప్రేక్షకులు ఉద్వేగంతో థియేటర్ల నుంచి కన్నీళ్లతో వస్తున్నారని గొప్పలు చెప్పుకుంటూ తన శునకానందం తీర్చుకుంటున్నాడు.