Advertisementt

ప్లాప్ డైరెక్టర్ కి ఆ హీరో అవకాశం ఇచ్చాడా..?

Sun 25th Jun 2017 06:21 PM
hero ravi teja,director sreenu vaitla,ravi teja and sreenu vaitla combination film  ప్లాప్ డైరెక్టర్ కి ఆ హీరో అవకాశం ఇచ్చాడా..?
Ravi Teja is Giving A Chance to Director Sreenu Vaitla ప్లాప్ డైరెక్టర్ కి ఆ హీరో అవకాశం ఇచ్చాడా..?
Advertisement
Ads by CJ

సినిమాలకు చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన రవితేజ ఉన్నట్టుండి ఒక్కసారే ఈ ఏడాది మొదట్లో  రెండు సినిమాలను లైన్ లో పెట్టి షాక్ ఇచ్చాడు. 'టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్' చిత్రాలను ఒకేసారి లైన్ లో పెట్టడమే కాదు రెండు సినిమా షూటింగ్స్ ని ఏకకాలంలో పూర్తి చేస్తున్నాడు. ఒకేసారి రెండు హిట్స్ తో తన అభిమానులకు సంతోషాన్ని కలగజెయ్యాలని రవితేజ భావిస్తున్నాడు. అందుకే అంతలా కష్టపడుతున్నాడు. ఒకేసారి రెండు సినిమాలతో హడావిడి చేస్తున్న రవితేజ ఇప్పుడు మరో మూవీ ని లైన్ లో పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.

అది కూడా ఒక ప్లాప్ డైరెక్టర్ కి రవితేజ అవకాశం ఇవ్వబోతున్నాడని న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. 'ఆగడు, బ్రుస్ లీ, మిష్టర్' వంటి అదిరిపోయే ప్లాప్స్ ఇచ్చిన శ్రీను వైట్లను పిలిచి మరీ రవితేజ ఛాన్స్ ఇవ్వబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి వరుసగా భారీ ప్లాపులిచ్చిన ఏ డైరెక్టర్ కి మరో అవకాశం రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ శ్రీను వైట్లకి నిజంగా రవితేజ ఛాన్స్ ఇచ్చాడు అంటే మళ్లీ శ్రీనుకు మంచి కాలం వచ్చినట్టే అంటున్నారు. ఇప్పటికే రవితేజతో శ్రీను వైట్ల కథా చర్చలు జరిపినట్టు రవితేజ కూడా శ్రీనుతో పనిచేసేందుకు సానుకూలంగా వున్నాడని వార్తలొస్తున్నాయి.

'వెంకీ, దుబాయ్ శీను' తో రవి తేజ కెరీర్ ని గాడిన పడేసిన శ్రీను వైట్ల కి ఇప్పుడు రవితేజ కూడా హెల్ప్ చెయ్యబోతున్నట్లే లెక్క. ఇప్పుడు శ్రీను పరిస్థితి టాలీవుడ్ లో అగమ్యగోచరంగా తయారైంది. అలాంటి టైం లో శ్రీను చెప్పిన కథకి రవితేజ ఇంప్రెస్ అయ్యి అతనికి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. మరి రవితేజ ప్లాప్ డైరెక్టర్ అయిన శ్రీనుని పిలిచి అవకాశం ఇవ్వడం మాత్రం రవితేజ ఫ్యాన్స్ కి ఏమాత్రం రుచించడంలేదనేది లేటెస్ట్ న్యూస్.

Ravi Teja is Giving A Chance to Director Sreenu Vaitla:

Ravi Teja is now reported to have made another movie on line. News is now a hot topic in Filmnagar Circles that Ravi Teja is likely to be a flops Director Sreenu Vaitla.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ