అల్లు అరవింద్.. నేటి నిర్మాతల్లో ఈయనది మాస్టర్ బ్రెయిన్, ఇప్పుడు దిల్‌రాజు కూడా అదే కోవలోకి వస్తున్నాడు.ఇక అల్లు అరవింద్ విషయానికి వస్తే టాలెంట్ ఉన్న వారిని వాసనబట్టి పసిగట్టడంలో ఆయన దిట్ట. చిరంజీవి సుప్రీం హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా మార్చడంలో ఆయనది పెద్దపాత్రే ఉంది. ఆయన సినిమాలలో సక్సెస్‌ని ఇవ్వలేకపోయింది కేవలం పవన్, బన్నీలు మాత్రమే. కానీ ఇతర నిర్మాతల సినిమాలలో కూడా బన్నీ నటిస్తుంటే ఆయన ప్రమేయం తప్పనిసరి.
వినాయక్, సుకుమర్ నుంచి బోయపాటి శ్రీను వరకు అదే కోవలోకి వస్తారు. ఇక రామ్ చరణ్‌తో రాజమౌళి మీద నమ్మకంతో ఆనాడే 'మగధీర'కు అంత బడ్జెట్ కేటాయించడం అంటే మాటలు కాదు. ఇక బన్నీ విషయంలో బోయపాటి శ్రీనులో ఉన్న టాలెంట్‌ని చూసి 'సరైనోడు'వంటి సాదా సీదా కథతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక మారుతిలోని ప్రతిభను గుర్తించి అల్లు శిరీష్‌ని 'కొత్త జంట'తో ఆయన చేతుల్లో పెట్టాడు.
సినిమా ఆడలేదు. కానీ మారుతిపై నమ్మకం మాత్రం పోలేదు. అంత డేర్‌ను యువిక్రియేషన్స్‌తో చేయబట్టే 'భలే భలే మగాడివోయ్' చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక 'సరైనోడు' రిలీజ్‌కు ముందే మెగాస్టార్ చిరంజీవి చిత్రం కోసం అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకున్నాడు. పరుశురాంలోని ప్రతిభ చూసి రొటీన్ కథైన 'శ్రీరస్తు శుభమస్తు' నిర్మించి అల్లు శిరీష్‌ని లైన్‌లోకి తెచ్చాడు. ఇక తాజాగా 'టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా' లతో డైరెక్టర్ వి.ఐ.ఆనంద్‌కి అవకాశం ఇచ్చి అల్లు శిరీష్ హీరోగా ఓ సైన్స్‌ఫిక్షన్ తీస్తున్నాడు.
కేవలం ఈ చిత్రం షూటింగ్‌ను ఐదారు రోజులు చూసిన తర్వాత ఆనంద్‌లో ఆయనకు మరో గొప్ప టాలెంట్ ఉందని గ్రహించి, ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆనంద్‌కి బన్నీతో ఓ చిత్రాన్ని తాము చెప్పిన వెంటనే చేయాలని, ఇప్పటి నుంచే బన్నీకి తగ్గ స్టోరీ, స్క్రిప్ట్ రెడీ చేయాలని ఆయన చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడు. అల్లు అరవింద్ లాజిక్కుకి అందడు. అదే ప్రస్తుతం వి.ఐ.ఆనంద్‌తో అల్లు శిరీష్ చేస్తోన్నచిత్రం హిట్టయితే బన్నీని చేతిలో పెడతాడు.
అల్లు శిరీష్ సినిమా ఆడకపోతే అడ్వాన్స్ వదులుకోకుండా, బన్నీ కోసం ఆనంద్ రాసుకున్న కథని తిరిగి మరో యంగ్‌హీరోకి తగ్గట్లు ఆ దర్శకుడి తాట తీసి మరో యంగ్ హీరోకి సూటయ్యేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయించి, ఏ విజయ్ దేవరకొండతోనే సినిమా తీసి హిట్ కొడతాడు. నిజానికి మారుతి విషయంలో కూడా ఇదే జరిగిందట. 'కొత్త జంట' సమయంలోనే బన్నీతో ఓ యూత్‌ఫుల్ చిత్రం తీయాలని భావించి బన్నీకి తగ్గట్లుగా మొదట మారుతి చేత స్క్రిప్ట్ రెడీ చేయించాడట.
'కొత్తజంట' ఫ్లాప్ కావడంతో బన్నీని మారుతి చేతికి ఇవ్వకుండా యాక్షన్‌డోస్ తగ్గించి, ఎంటర్‌టైన్‌మెంట్ పండించి నానితో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. రేపు వి.ఐ. ఆనంద్ పరిస్థితి కూడా అంతే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.