Advertisementt

వీరి కోల్ద్‌వార్‌కి అంతే లేదా..?

Sun 25th Jun 2017 05:34 PM
mega family,manchu family,chiranjeevi,mohan babu,allu arjun,dj movie,pawan kalyan  వీరి కోల్ద్‌వార్‌కి అంతే లేదా..?
Cold War Between Mega Family and Manchu Family వీరి కోల్ద్‌వార్‌కి అంతే లేదా..?
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి వైరం ఇప్పటిది కాదు.. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక పవన్‌కి మోహన్‌బాబు అంటే అసలు పడదు. చిరంజీవైనా పట్టువిడుపులు ప్రదర్శిస్తాడు...కానీ పవన్‌ అలా కాదు.. ఎవ్వరి మీదా కోపం రాదు.. వచ్చిందంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడని అది తెలిసిన వారు చెబుతుంటారు. ఇక మోహన్‌బాబు పలు వేదికలపై మెగా కాంపౌండ్‌ హీరోల మీద వ్యంగ్య బాణాలు వదులుతుంటాడు. 

పోనీ పవనేమైనా తక్కువ తిన్నాడా? అంటే లేదు. 'తమ్ముడు' మోహన్‌బాబు పై తనదైన వ్యంగ్య శైలిలో తన సినిమాలలో ఇమిటేట్‌చేయడం చేస్తుంటాడు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో 'చా..లా..బా...గో..దు' అంటూ పదే పదే డైలాగ్‌ చెప్పి మంచు అక్కకు మంచి షాకిచ్చాడు. అయినా బన్నీకి మోహన్‌బాబు అండ్‌ బ్యాచ్‌ మీద కసిపోలేదు. తాజాగా మంచు మోహన్‌బాబును అనుకరిస్తూ ఆయన తన 'పెదరాయుడు' చిత్రంలో చెప్పిన ఫేమస్‌ డైలాగ్‌ను ఓఆటాడుకున్నాడు. 

'ది రిలేషన్‌ షిప్‌ బిట్వీన్‌ వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌' అంటూ కేకపుట్టించాడు. అసలు బన్నీ కొన్ని డైలాగ్స్‌ను తన దైనశైలిలో చెప్పడంలో ఇప్పుడిప్పుడే ఆరితేరుతున్నాడు. 'రేసుగుర్రం'లో చెప్పిన 'ద్యా..వుడా' అనేది ఎంతగా పాపులర్‌ అయిందో తెలుసు. 

తాజాగా 'డిజె'లో బ్రాహ్మణ వేషధారణ, వారి మాటతీరుతో పాటు ఈ పాపులర్‌ డైలాగ్‌లో ఆయన మోహన్‌బాబును కాపీ కొడుతూ ఆ డైలాగ్‌కు థియేటర్లు దద్దరిల్లేలా చేశాడు.మరి మంచు ఫ్యామిలీ దీనికి కౌంటర్‌ని ఏదైనా వేడుకలో ఇవ్వనున్నారా? తమ సినిమాల ద్వారా ఇవ్వనున్నారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. 

Cold War Between Mega Family and Manchu Family:

Mega family has no quarrel for the Manchu family. The grass is between them Fire. Pawan is not like Mohan Babu. In the latest 'DJ', Brahmin's hobby, along with their speech, he copied Mohan Babu in this popular dialog and made the theatrical debut for the dialogue.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ