టాలీవుడ్‌లోని స్టార్స్‌లో సౌమ్యుడు, వివాద రహితుడు, మహా మొహమాటస్తుడు. కులం పట్టించుకోని మంచి వారిలో ముందుగా ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ఇక ఆయన రెమ్యూనరేషన్ విషయం కూడా పట్టించుకోడు అంటారు.కాగా ప్రభాస్ ఇమేజ్‌ను ఇటీవల వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్', 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లు ఎవరెస్ట్ స్థాయిలో కూర్చోబెట్టాయి. కాగా నేడు ప్రభాస్ మామూలు యంగ్ రెబెల్ స్టార్ కాదు.. నేషనల్ స్టార్.
ఈ క్రేజ్‌ను వాడుకుని 'బాహుబలి' క్రేజ్‌ను వాడుకోవాలని ప్లాన్ వేసిన నిర్మాతలకు బాహుబలి టైంలోనే తన తదుపరి చిత్రం 'సాహో'అని చెక్‌పెట్టాడు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో 'సాహో'లో ఉన్నాడట. ఇంకా తన వర్క్‌ని ప్రారంభించలేదని, ప్రస్తుతం విలన్‌నీల్ నితిష్ అనే విలన్‌పై కొన్ని యాక్షన్ సీన్స్‌ని సుజీత్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌ని అబుదాబిలో ప్లాన్ చేశారు.
కాగా ముంబైలో ఉన్న ప్రభాస్ తాజాగా భాహుబలిని బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ ఇచ్చిన గ్రాండ్ పార్టీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన కరణ్ జోహార్‌తోనే 'సాహో' తదుపరి చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ 'సాహో' తర్వాత సినిమా కరణ్ జోహార్‌కి చేయడం లేదని, మరో పెద్ద నిర్మాత సాజిద్ నదియావాలాతో చర్చలు పూర్తయ్యాయని, ప్రభాస్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాడని ఓ జాతీయ దిన పత్రిక కధనం ప్రచురించింది. ఇక రాజమౌళి సంగతితో పాటు సాజిద్ నదియావాలా దర్శకుడు ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది...!