బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లోనూ నిజజీవిత ఆధారిత సినిమాల హవా సాగుతోంది. ఇక ఇది ఇప్పుడు పీక్స్‌కి చేరింది. త్వరలోనే స్వర్గీయ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీలతో పాటు ఇంగ్లీషులో, ప్రపంచంలోని పలు భాషల్లో నిర్మిస్తానని, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుందని ప్రముఖ నిర్మాత అనిల్‌సుంకర ఇప్పటికే తెలిపాడు. మరోవైపు బాలీవుడ్‌లో కూడా ఒక నిర్మాత అబ్దుల్‌కలాం మీదనే ఓ డాక్యుమెంటరీ తీస్తున్నాడు.
ఇక తాజాగా టెన్నిస్‌స్టార్, గ్లామర్ ఆటగత్తె, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, పాక్ కోడలు, టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా బయోపిక్ రూపొందనుంది. తాజాగా మన్మోహన్‌సింగ్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తీయనున్నారు. మరోవైపు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీవ్ర విమర్శల పాలై వాక్ స్వాతంత్య్రం, మీడియా స్వేఛ్చ కూడా లేకుండా చేసి నాటి పెళ్లికాని మహిళలను, మగాళ్లను పట్టుకుని సంతానం కలగకుండా నిర్బందంగా ఆపరేషన్లు చేయించి, ఎవ్వరికీ స్వేచ్చ లేకుండా చేసి, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి నానా దురాగతాలకు పాల్పడిన ఇందిరాగాంధీ, ఆమె చిన్నకొడుకు సంజయ్‌గాంధీలు ఎమర్జెన్సీ పేరుతో చేసిన వికృతపాలన, నియంత ధోరణులు, ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అయింది? ఎందరిని జైళ్లలో ఉంచి చిత్ర హింసలు పెట్టి, చివరకు అధికారం కోల్పోయింది వంటి యదార్ధగాధ అంశాల ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కాంగ్రెస్ నాయకుల్లో గుబులు, భయం రేపుతోంది.
మరోపక్క వాజ్‌పేయ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు సాహసోపేతంగా ప్రపంచదేశాలను ధైర్యంగా ఎదిరించి జరిపిన పోక్రాన్ అణుపరీక్షలు నాటి చరిత్ర గురించిన చిత్రం.. పోఖ్రాన్, జైసల్మేర్ వంటి ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇందులో జాన్ అబ్రహం వంటి స్టార్ నటిస్తుండటం విశేషం. ఇక తెలుగులో ఎలాగూ మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనిలో కీర్తిసురేష్, సమంతలతో పాటు దుల్కర్ సల్మాన్ కూడ నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రను ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ పోషించనున్నాడనే పుకార్లకు తెరపడింది. తాను ఆ పాత్ర చేయడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావు, జమునల పాత్రలో ఎవరు నటిస్తారో అనే ఆసక్తి ఉంది.
కానీ ఈమధ్య మన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఓ జీవో తెచ్చాడు. దాని ప్రకారం ఎవరి బయోపిక్, నిజజీవిత కథలను తెరకెక్కించాలన్నా కూడా వారి వారసుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తేవాలని మరో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నాడు. దానిని ఇటీవలే కేంద్ర సెన్సార్ బోర్డ్ అధ్యక్షుడు పెహ్లాజ్ నిహలానీ కూడా బలపరిచాడు. దీంతో ఏయే చిత్రాల విషయంలో ఏయే సంచనాలు ఉంటాయి.? అసలు వారసుల నుంచి ఎన్‌వోసీ తెమ్మనడం ఎంతవరకు సబబు? అణుపరీక్షలు, మన్మోహన్ సింగ్ జీవితంలో నిజాలు, ఎమర్జెన్సీలో ఎంత భయానక పరిస్థితి ఉన్నాయి? వంటి వాస్తవాలను నేటితరానికి, భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన పనిలేదా? నేడు ఇందిరా, సంజయ్‌గాంధీ అకృత్యాలు బయటపడటం కేంద్రమంత్రికి ఇష్టమే గానీ , భవిష్యత్తులో వారిలాగే నియంత ధోరణిలో వ్యవహరిస్తున్న మోదీ, తన మీద కూడా ఇలాంటి బయోపిక్‌లు తీస్తారనే భయమే ఈ కొత్త నిబంధనలకు కారణమని చెప్పవచ్చు.