మహానటి సావిత్రి సినిమా చెయ్యడం కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ బాగానే కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ మీదే చాలా నెలలు కూర్చున్న అశ్విన్ కి నటీనటుల ఎంపిక కూడా ఒక సవాల్ గా మారింది. మహానటి సావిత్రి పాత్రకి యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ని తీసుకోగా, టాలీవుడ్ ని కోలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్న సమంతని మరో కీలక పాత్రకి ఎంపిక చేశాడు. ఇక పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ కూడా మహానటి చిత్రంలో నటించనున్నాడు. అలాగే సావిత్రి భర్త జెమినీగణేశన్ పాత్రకి ఫుల్ ఫామ్ లో ఉన్న యువ నటుడు దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నాడు. మరి సావిత్రి నట జీవితం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ కి ముడిపడిఉంది కాబట్టి రెండు భాషలకు పరిచయమున్న నటులైతే రెండు భాషల్లో తెరకెక్కిస్తున్న మహానటి సావిత్రికి మంచి క్రేజ్ వస్తుందని అశ్విన్ భావించాడు.
ఇకపోతే సావిత్రి నటజీవితంలో ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, జెమిని గణేశ్, శివాజీ గణేశ్ వంటి నటుల పాత్ర చాలా వుంది. మరి ఎన్టీఆర్ పాత్రని అయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరగడమూ... అది కాస్తా ఎన్టీఆర్ సన్నిహితులు ఖండించడము జరిగిపోయింది. ఇకపోతే సావిత్రి సినిమాలలో లెక్కలేనన్ని కీలక పాత్రలు పోషించిన ఎస్ వి రంగారావు కూడా సావిత్రి నట జీవితంలో చాలా కీలక నటుడు. అయితే ఎస్ వి రంగారావు పాత్రకి టాలీవుడ్ లో సీనియర్ నటుడు మోహన్ బాబు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని ఎస్ వి రంగారావు పాత్రకు ఎన్నుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
మరి మహామహులు నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ మహానటి మీద భారీ అంచనాలే వున్నాయి. రోజు రోజు కి అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.