జగన్ బొత్తిగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. తిరుమలలో చెప్పులతో దైవ దర్శనానికి రావడం, క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా పరమతం వారు విధిగా టీటీడీ అనుమతి తీసుకోవాల్సిన విషయం వదిలేసి దేవుడిని సందర్శించడం, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల స్వామికి ఏడు కొండలు అవసరమా? అని వ్యాఖ్యానించి తీవ్రంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, మత వివక్ష చూపడం వంటివి, దగ్గరలోనే ఉన్నాను కదా! అని వారానికో సారి లగ్జరీ కారులో మేకప్‌తో వెళ్లి ఎమ్మెల్యే, నటి రోజా రాజకీయాలు, పలు బూతులు మాట్లాడటం చేయడం చూస్తుంటే అందరి రక్తం ఉడుకుతోంది. మరి రోజాకు, ఆమె, జగన్‌ని సమర్ధించే వారికి చీము నెత్తురు ఉన్నాయో లేదో గానీ న్యూట్రల్‌గా ఉండే ప్రజలకు మాత్రం తెలియని ఆవేశాన్ని తెస్తున్నాయి.
క్రిస్టియన్ మతం పుచ్చుకున్న తర్వాత కూడా జగన్ ఇంకా హిందుగా రెడ్డి అనే తోకను ఎలా పెట్టుకుంటాడు? ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్దితో పాటు మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వరకు క్రిస్టియన్ మతం పుచ్చుకుని, మైనార్టీల ముసుగులో పలు విద్యాసంస్థలను, మైనార్టీల కుండే ఇతర సదుపాయాలను, వసతులను ఎలా పొందుతున్నారు? కనీసం బిజెపి అయినా ఈ విషయంలో ఏదో ఒకటే తేల్చుకోవాలనే నిబంధనను ఎందుకు విధించరు? ఒకవైపు రెడ్డితో పాటు పలు తోకలను పెట్టుకునివారి ఓటు బ్యాంక్‌కు, నేనూ మీ కులమే అని చెప్పి, పక్క వీధికెళ్లి క్రిస్టియన్లు ఎక్కువగా అక్కడ ఉంటే నేను క్రిస్టియన్‌ని అని మతం మార్చుకున్న మైనార్టీలను మచ్చిక చేసుకోవడం సమంజసమేనా?
తిరుమలలో రోజాకు ఇప్పటికే రాజకీయాలు, బూతులు వద్దని టిటిడి అధికారులు చెబుతున్నా వినడంలేదు. తాజాగా శివసేన, విహెచ్‌పి వంటి హిందు సంస్థలు కూడా ఆమెకు హెచ్చరికలు జారీ చేశాయి. దేవుడి మీద నమ్మకం లేకపోతే మీకు నచ్చిన మతంలోకి వెళ్లే హక్కు మీకుంది గానీ.. పక్కమతం వారి మనోభావాలను మరోసారి దెబ్బతీస్తే ఊరుకునేది లేదని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా కూడా రోజా ఇదే పనిచేసింది. ఇకనైనా టిటిడి అధికారులు, సిబ్బంది, హిందు సంస్థలు ఏకతాటిపైకి రావాలి. కుల, మతాలకు అతీతంగా స్పందించాలి. అలాగే ఎవరు ముస్లిం అయినా క్రిస్టియన్, సిక్కు, జైన్.. ఇలా మతం ఏదైనా పక్కవారి మతం మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సివుంది...!