తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు అందరూ తీవ్రంగా తీసుకుంటున్నారు. అసలే బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి నిజజీవితంలో కూడా నిప్పులాంటి ఐవైవి కృష్ణారావును తొలగించిన తీరు వివాదస్పదమవుతోంది. కేవలం టిడిపి పద్దతులను ఓపిక నశించి, మనసులో దాచుకోలేక ఆయన ప్రశ్నించడమే నేరమా? మరి ఆయన్ను నిప్పుగా భావించే ఆయనకు ఎన్నోపదవులను బాబు ఇచ్చింది నిజం కాదా? మరి నాడు నిప్పు అయిన వ్యక్తి టిడిపిని కాస్త విమర్శించగానే లేదా మీడియా స్వేఛ్చ గురించి, పొలిటికల్ సెటైర్ రవికిరణ్ అరెస్ట్‌ను తప్పుపట్టిడమేనా కృష్ణారావు చేసిన తప్పు? ఆయనేం మీ పార్టీ కార్యకర్తో లేదా ఎమ్మెల్యే కాదు...ఆయన నిజాయితీ కలిగిన ఓ ఐఏయస్ అధికారి, ఆయన్ను మీరందరూ రాముళ్లైనట్లు ఆయనపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంససం?
మేధావులకు, నిజాయితీపరులను కూడా ఇలా చేస్తే భవిష్యత్తులో ఎవ్వరూ నిజాయితీపరులుగా ఉండలేక ప్రభుత్వాలకు భజన చేస్తూ ఉండిపోవాల్సిందేనా? సభ్యసమాజానికి, నేటి తరానికి, రాబోయే తరాలకు బాబు ఇచ్చే మెసేజ్ ఇదేనా? ఇక తాజాగా నేను వేసిన రోడ్లపై నడవవద్దు... నేనిచ్చే పెన్షన్ల్, రేషన్ తీసుకోవద్దు పై జాతీయ మీడియాలో కూడా తీవ్ర కథనాలు, చర్చసాగుతోంది. ఇక దీనిపై నెటిజన్లు పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు.
కొందరు మీరు, మీ కుటుంబసభ్యులు, మీ మనవడు దేవాన్ష్‌ని కూడా హైదరాబాద్ రోడ్లపై తిరగ నివ్వకండి.. మీ వియ్యంకుడు, హిందుపురం ఎమ్మెల్యే, సినీస్టార్ బాలకృష్ణను కూడా తెలంగాణ, ఇతర ప్రాంతాలలో షూటింగ్ చేయనివ్వకండి. ఎందుకంటే అవి కేసీఆర్ వేసిన రోడ్లు కదా...! అంటున్నారు.
ఇక ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ పడింది. ఆ ట్వీట్‌లో ఆయన 'చంద్రబాబూ...ప్రజలు నిన్ను విమర్శించడం నచ్చకపోతే వారిచ్చే పన్నులు తీసుకోవద్దు...వాళ్లను ఓట్లు అడగడం కూడా మానేయండి'.. అనే మెసేజ్ వచ్చింది. ఇక తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని, మీ సంగతి తర్వాత.. మొదట నా మాటలు వినండి అని ప్రశ్నించడం తీవ్ర వివాదాలను కొనితేస్తోంది.