ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi's 151th Film Three Heroines Confirmed?

చిరు 151 కి హీరోయిన్స్ సెట్ అయినట్లే..!

చిరంజీవి ఇప్పుడు తన 151 వ ప్రాజెక్ట్ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం కోసం పూర్తిగా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఉయ్యాలవాడ లుక్ లో సూపర్ గా కనబడుతున్న చిరు ఈ చిత్రాన్ని ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేసి జాతీయ స్థాయిలో ఫేమస్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక చిత్రంగా  డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో గ్రాండ్ గా లాంచ్ చెయ్యబోతున్నాడు. అతిత్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట.

ఇక ఉయ్యాలవాడలో నటించే నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి ముగ్గురు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడట. అందులో ఒకరు బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్ కాగా మరో ఇద్దరు అనుష్క శెట్టి, నయనతారలు అంటున్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మలతో చిత్ర యూనిట్ చర్చలు జరిపి ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో కథకు అనుగుణంగా హీరోగారికి ఇద్దరు భార్యలు ఉంటారని... మరొక స్త్రీతో కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉంటాడట. కాబట్టే ఈ చిత్రానికి ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యాల్సి వచ్చిందని అంటున్నారు.

అయితే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం లాంచింగ్ రోజునే ఈ ముగ్గురు హీరోయిన్స్ పేర్లు కూడా అనౌన్స్ చేస్తారనే టాక్ వినబడుతుంది. అలాగే చారిత్రాత్మక కథ అయినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా డాన్స్ లు, పాటలు, ఫైట్స్ వంటి వాటికి ఈ చిత్రంలో ఫుల్ గా చోటు ఉంటుందట.

Tollywood's next magnum opus Uyyalawada Narasimhareddy's launch is eagerly awaited by movie lovers.

Chiranjeevi's 151th Film Three Heroines Confirmed?
uyyalawada narasimhareddy
chiranjeevi
nayanthara
aishwarya rai
anushka
ram charan
heroines