Advertisementt

బాలయ్య తో చేయడానికి నయన్ డిమాండ్ ఇది!

Thu 22nd Jun 2017 09:51 PM
balakrishna,nayanthara,c kalyan,nayanthara dimand,ks ravikumar  బాలయ్య తో చేయడానికి నయన్ డిమాండ్ ఇది!
Balakrishna and Nayantara's Romance Third Time బాలయ్య తో చేయడానికి నయన్ డిమాండ్ ఇది!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఇప్పుడు సినిమాల మీద సినిమాలు మొదలు పెట్టేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ప్రస్తుతానికి పూరి డైరెక్షన్ లో 'పైసా వసూల్' చేస్తున్న బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్‌లో లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగియడంతో ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో తన 102 వ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళుతున్న బాలకృష్ణ కి హీరోయిన్ గా మూడోసారి నయనతార జత కడుతున్నట్లు ఆఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'సింహా, శ్రీరామరాజ్యం' వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు ముచ్చటగా మూడోసారి నటించి హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తుంది ఈ జంట.

ఇక తమిళంలో సూపర్ స్పీడుతో దూసుకుపోవడమే కాకుండా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ఇప్పుడు బాలకృష్ణ చిత్రానికి కూడా మూడున్నర కోట్ల రూపాయలు అందుకుంటున్నట్టు సమాచారం అందుతుంది. ఇక బాలయ్య 102 వ చిత్రంలో నయనతార నటిస్తున్నట్టు నిర్మాత కళ్యాణ్ఆఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేశాడు. 

ఈ నెల 27 న బాలకృష్ణ - కె.ఎస్. రవికుమార్ ల కొత్త చిత్రం లాంచ్ చేయబోతున్నాం.... వచ్చేనెల 1 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని..... అయితే ఫస్ట్ షెడ్యూల్ మాత్రం తమిళనాడులోని కుంబకోణం జిల్లాలో జరుగుతుందని నిర్మాత కళ్యాణ్ చెబుతున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాతి కి విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారట.

Balakrishna and Nayantara's Romance Third Time:

Nayantara is all set to share screen space with Balayya for the third time. And this news was officially revealed by C Kalyan, who is producing Balakrishna's 102nd venture.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ