Advertisementt

ఈసారి అఖిల్‌ మూవీ టైటిల్ పై పుకార్లు!

Thu 22nd Jun 2017 09:01 PM
hellow guru prema kosamero,nagarjuna,akhil akkineni,vikram k kumar,nirnayam movie  ఈసారి అఖిల్‌ మూవీ టైటిల్ పై పుకార్లు!
Rumors on Akhil Second Movie Title ఈసారి అఖిల్‌ మూవీ టైటిల్ పై పుకార్లు!
Advertisement
Ads by CJ

తాజాగా నాగార్జున తన తనయుడు అఖిల్‌ నటిస్తున్న రెండో చిత్రంలో హీరోయిన్‌గా శ్రీదేవి కూతురి పేరుతో పాటు పలువురి పేర్లు ప్రచారంలోకి రావడాన్ని ఖండించాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ విషయంలో గాసిప్‌లు నమ్మవద్దని, ఆమెను తామే అఫీషియల్‌గా ప్రకటించేదాకా ఆగాలని కోరిన సంగతి తెలిసిందే. దాంతో హీరోయిన్‌ విషయంలో పుకార్లు ఆగాయి. 

కానీ తాజాగా ఈ చిత్రం టైటిల్‌పై విపరీతమైన వార్తలు వస్తున్నాయి. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రానికి 'జున్ను' అనే టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నాడని, కానీ సినిమాకు రొమాంటిక్‌ టచ్‌ ఇచ్చేలా సినిమా టైటిల్‌ ఉండాలని, క్యాచీగా ఉంటూనే పొయిటిక్‌ గా ఉండాలని నిర్మాత కూడా అయిన అఖిల్‌ తండ్రి అయిన నాగార్జున ఆలోచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఇక ఎప్పుడో నాగార్జున-అమల కలసి నటించిన మూడో చిత్రం 'నిర్ణయం' ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ డైరెక్టర్‌కాగా, సంగీతాన్ని ఇళయరాజా అందించారు. ఈ చిత్రాన్ని మురళీమోహన్‌ ఆ రోజుల్లోనే భారీ సెట్స్‌వేసి నాడే పెద్ద బడ్జెట్‌లో నిర్మించాడు. 

మంచి కామెడీ, రొమాంటిక్‌ ఎంటర్‌టైననర్‌ అయిన ఈ చిత్రంలో నాగ్‌ అమలను ఏడిపిస్తూ పాడే 'హలో గురూ ప్రేమకోసమేరో జీవితం.. మగాడితో ఆడదానికేలా పౌరుషం... ప్రేమించాను నిన్నే.. కాదంటున్నావు నన్నే.. మహా మహా సుందరాంగులే పొందలేని వాడిని.. అంటూ పాట సాగుతూ. అక్కినేని అంతటోని అనే పదం కూడా ఆ పాట లిరిక్‌లో ఉంటుంది. ఇప్పటికీ ఆ పాట ప్రెష్ గానే ఉంటుంది. 

తాజాగా ఈ పాటలోని 'హలో గురూ ప్రేమకోసమేరో' అని పెట్టాలని భావిస్తున్నారట. దీనిపై నాగ్‌ అఫీషియల్‌గా స్పందించే వరకు వేచిచూడాల్సివుంది..! 

Rumors on Akhil Second Movie Title:

Hellow Guru Prema Kosamero is the Akhil Second Movie Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ