'డిజె'.. దిల్‌రాజు, అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం, దిల్‌రాజు 'శతమానంభవతి, నేనులోకల్'లో పీక్స్ మీద ఉండటం, బన్నీ 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు' వంటీ జోష్‌తో వరుసగా మూడు 50కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రాలు చేయడం, దిల్‌రాజుకి ఇది 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం, దేవిశ్రీ అందించిన పాటలు, బన్నీ డ్యాన్స్‌లు ఇరగదీయడం, 'గబ్బర్‌సింగ్' తర్వాత అంతటి హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ యాక్షన్ అండ్ మాస్‌గా రూపొందిందని హరీష్‌శంకర్‌పై వస్తున్న పాజిటివ్ బజ్ వంటివి చూస్తుంటే మరో సెన్సేషనల్ హిట్ ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.
ఇక సోలో రిలీజ్ కావడమే కాదు.. తెలుగులో కొంతకాలం వరకు పెద్ద పోటీ లేని కారణంగా అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ మస్త్‌గా ఉంటుందని తెలుస్తుండటంతో ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లు రావడం ఖాయమంటున్నారు. అయితే 'ట్యూబ్‌లైట్' పోటీగా ఉండటం, రెండు తమిళ చిత్రాలు విడుదల కానుండటం వల్ల కాస్త కలెక్షన్లు తగ్గుతాయంటున్నారు. కాని నిర్మాత, హీరోలు మాత్రం మా ఫ్యాన్, మా ఆడియన్స్ మాకున్నారు అనే ధీమాలో ఉన్నారు. దీంతో ఈ చిత్రం మొదటి రోజును దిల్‌రాజు 25 నుంచి 30కోట్లవరకు రాబడుతుందనే అంచనాలో ఉన్నాడు. ట్రేడ్ పండితులు కూడా అదే అంటున్నారు.
సినిమా ఎలా ఉన్నా వీకెండ్‌కి 50కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే ఆ తర్వాత లాంగ్‌రన్ ఉంటుందని లేకపోతే 'బ్రహ్మోత్సవం, రామయ్యా..వస్తావయ్యా, సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు' లాగా ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు. చూద్దాం 'డిజె' దుమ్ముదులుపుడేందో..!