Advertisementt

శ్రీదేవి సీక్రెట్ చెప్పేసింది..!

Thu 22nd Jun 2017 06:44 PM
sridevi,jhanvi kapoor,khushi kapoor,mom,international yoga day  శ్రీదేవి సీక్రెట్ చెప్పేసింది..!
Sridevi Beauty Secret శ్రీదేవి సీక్రెట్ చెప్పేసింది..!
Advertisement
Ads by CJ

50  ప్లస్ ఏజ్ లోనూ ఇంకా వన్నెతరగని అందంతో తన కూతుళ్ళకు గట్టి పోటీ ఇస్తున్న అతిలోక  సుందరి శ్రీదేవి ఇంకా తన గ్లామర్ ని రోజు రోజుకి పెంచుకుంటూనే వుంది. తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లకు ఏమాత్రం తగ్గకుండా శ్రీదేవి ఎప్పటికప్పుడు తన అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే తాను ఇంత ఆరోగ్యంగా, అందంగా, ఫిట్ గా ఉండడానికి కారణం మాత్రం తాను ఎప్పటినుండో చేసే యోగా సాధన మాత్రమే అని గర్వంగా చెబుతుంది ఈ ఓల్డ్ బ్యూటీ.... అమ్మో ఓల్డ్ బ్యూటీ అంటే శ్రీదేవి కోపంవచ్చెయ్యదూ.. మరి కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నా.... ఇంకా హీరోయిన్స్ కేరెక్టర్స్ నే కోరుకుంటున్న శ్రీదేవిని ఏ బ్యూటీ అని పిలవాలో కదా...

అయితే తాను ఎంతోకాలం నుండి యోగా సాధనలో తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్నట్లు చెబుతుంది శ్రీదేవి. ఈ వయసులో కూడా ఇంత ఫిట్నెస్ కి కారణం యోగానే అనిచెబుతుంది. ఇక తాజాగా 'మామ్' ఫిల్మ్ ప్రమోషన్స్ లో బిజీగా వున్న శ్రీదేవి మరోపక్క ఫిలింఫేర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్స్ కూడా చేయించుకుంటుంది. మరి ఈ వయసులో మ్యాగజైన్ మీద కవర్ పేజీ కోసం శ్రీదేవి ని ఫోటో షూట్ చేశారు అంటే ఆమె అందానికి ఎంతలా ఫిదా అవ్వకపోతే ఇలా ఫొటోస్ వేస్తారో కదా... అని ముచ్చటించుకుంటున్నారు సినీ ప్రియులు.

ఇక అతి త్వరలోనే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినీరంగ ప్రవేశం చేయబోతుంది. మరోపక్క శ్రీదేవి కూడా సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటూ తెగ బిజీ అయ్యింది. అలాగే ఏ భాషలోనైనా నటించడానికి అయినా  సిద్ధమని ప్రకటించేస్తుంది  శ్రీదేవి.

Sridevi Beauty Secret:

Sridevi is the latest star to join her colleagues in posting pictures on International Yoga Day.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ