Advertisementt

'రంగస్థలం' రేంజ్ ఏంటో తెలిసిందా..!

Thu 22nd Jun 2017 04:25 PM
ram charan,sukumar,rangasthalam 1985,satellite rights  'రంగస్థలం' రేంజ్ ఏంటో తెలిసిందా..!
Rangasthalam Satellite Rights at 16 Crores 'రంగస్థలం' రేంజ్ ఏంటో తెలిసిందా..!
Advertisement
Ads by CJ

సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతున్న 'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ తో సమంత మొదటిసారి జోడి కడుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. దాదాపు 70  కోట్ల పైబడే పెట్టుబడి ఎక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం అందుతుంది.

పక్కా పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ పల్లెటూరి ప్రేమ కథా చిత్రానికి శాటిలైట్ హక్కులు భారీ రేటు పలికినట్లు.... ఆ రేటు 16 కోట్లకు ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా ఏ ఛానల్ వారితో అగ్రిమెంట్స్ పూర్తి కాలేదని చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఇంత భారీ ధర  పలకడానికి కారణం డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని 1980 లో ఫ్రెష్ లవ్ స్టోరీ తో విభిన్న కథాంశంతో తెరకెక్కించడం వల్లనే ఇంత రేటు పలికిందని అంటున్నారు . ఇక రామ్ చరణ్ సినిమాలకు ఇంత అధిక మొత్తంలో శాటిలైట్ ధర పలకడం అంటే రికార్డే మరి.

Rangasthalam Satellite Rights at 16 Crores:

Ramcharan, Sukumar combination Rangasthalam 1985 satellite rights business has started. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ