'బాహుబలి' చిత్రం కోసం వేసిన మాహిష్మతి సెట్‌ను రాజమౌళి చాలా తెలివిగా తన ఇంటర్వ్యూలకు, ఆడియో వేడుకతో పాటు పలు విధాలా ప్రమోషన్‌కు వాడుకున్నాడు. దానికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇక తాజాగా దిల్‌రాజు తన 25వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా అల్లుఅర్జున్ హీరోగా నటిస్తూ ఈనెల 23న రిలీజ్‌కు రెడీ అవుతున్న 'డిజె' కోసం ఓ ప్రత్యేక సెట్ వేశాడు.
ఆరు లక్షలతో వేసిన ఈ సెట్‌లోనే అందరికీ ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు. ప్రెస్‌మీట్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలకు కూడా ఇక్కడే ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాడు. దీనిని ఓ ప్రముఖ స్టూడియోలో వేశారు. మొదట అదే ఫ్లోర్‌లో 'స్పైడర్' టీం షూటింగ్‌ను ప్లాన్ చేశారు. కానీ దిల్‌రాజు రిక్వెస్ట్ చేయడంతో 'స్పైడర్' షూటింగ్ లోకేషన్‌ను వేరే చోటికి మార్చుకున్నారు.
నగరానికి నడి బొడ్డున ఉన్న ఈ స్టూడియోలోనే సెట్ వేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని దిల్‌రాజు భావిస్తున్నాడు. మొత్తానికి 'డిజె' టీం 'బాహుబలి' నుంచి కొంత కాపీ కొడితే, రాబోయే రోజుల్లో ఇదో స్పెషల్ ట్రెండ్‌గా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు.