Advertisementt

ఆడియో ఆర్భాటం అంటే ఇదేనా..?

Wed 21st Jun 2017 06:10 PM
rajinikanth,robo 2.0,director shankar,lika production,audio launch in dubai  ఆడియో ఆర్భాటం అంటే ఇదేనా..?
Superstar Rajinikanth Film Robo 2.0 Audio Update ఆడియో ఆర్భాటం అంటే ఇదేనా..?
Advertisement
Ads by CJ

నేటి దర్శక నిర్మాతలు కథతో, ఇతర విషయాలలో పోటీ పెట్టుకోవడం మానివేసి, బడ్జెట్‌, హంగులు, ఆర్భాటాలు.. ఇలా డబ్బును వృదా చేస్తున్నారు. ఇక 'బాహుబలి'కి అంత పెట్టుబడి పెట్టినా కూడా తెలుగులో ఎలాగూ ప్రమోషన్‌ అవసరం లేదని భావించి, కేవలం బాలీవుడ్‌లోనే ప్రమోషన్స్‌ చేశారు. అందునా రాజమౌళి, ప్రభాస్‌, అనుష్క, కీరవాణిలు ఉత్తరాది వారికి అంతగా పరిచయం లేకపోవడంతో ఈ మాత్రమైనా పబ్లిసిటీ చేశారు. 

ఈ చిత్రం బడ్జెట్‌, విజయంతో పోల్చుకుంటే ఆ చిత్ర నిర్మాతలు ప్రమోషన్‌కి పెట్టిన ఖర్చు నామ మాత్రమే. విషయానికి వస్తే తన '2.0'తో బాహుబలి, దంగల్‌ వంటి అన్ని చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి దేశవ్యాప్తంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా రికార్డులు క్రియేట్‌ చేయాలని శంకర్‌తో పాటు లైకా ప్రొడక్షన్స్‌ అధినేతులు భావిస్తున్నారు. ఇప్పటికే సినిమా తీయడానికే 450కోట్ల దాకా ఖర్చుపెట్టిన వీరు ఏకంగా ఆడియోకు 25 కోట్లు ఖర్చుపెడుతున్నారట. 

వాస్తవానికి ఈ చిత్రానికి ముందే శంకర్‌ దేశ వ్యాప్తంగా పరిచయం. ఇక ఈ చిత్రానికి కలెక్షన్లు రావడానికి దక్షిణాదలో రజినీ చాలు. ఇక ఉత్తరాదిలో కూడా రజినీకి పెద్ద ఫాలోయింగే ఉంది. అందునా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నాడు. ఏఆర్‌రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు. సల్మాన్‌తో ఎఫర్‌ దాకా ఈ చిత్రం హీరోయిన్‌ అమీజాక్సన్‌ ఫే˜మస్‌. మరి ఈ చిత్రం ఆడియో వేడుకకు 25కోట్లు అవసరమా? అంటే ఎవ్వరివద్దా సమాధానం లేదు. 

వారి సినిమా వారిష్టం అన్నది ఒక్కటే సమాధానం. ఇక ఈ వేడుకను దుబాయ్‌లోని ఓపెన్‌ స్థలంలో చేయనున్నారు. హాలీవుడ్‌ నటులు నుంచి వారు ఆహ్వానించే అతిధుల జాబితా చూస్తే కళ్లు దిమ్మతిరుగాయట. గతంలో శంకర్‌ 'ఐ' చిత్రానికి ష్వాట్జర్‌ నేగర్‌ని పిలిచాడు. అయినా అతనేమైనా ఆ సినిమాని లాంగ్‌రన్‌లో ఆదుకున్నాడా? లేదే? కేవలం తొలి రోజుకు మాత్రమే ఆ తంత్రం పనిచేసింది. అయినా ఆ హాలీవుడ్‌ నటుడు రాకపోయినా ఆ చిత్రానికి అవే మొదటి వారం వసూళ్లు వచ్చేవి. మొత్తానికి ఎవడి జిల వాడికానందం.. మనకిలేని దురద జాలీమ్‌లోషన్‌కి ఉండదు కదా...!

Superstar Rajinikanth Film Robo 2.0 Audio Update:

Today's producers, with the story and other contests, stop competing, budgeting, hang ups, and money.They have already spent over Rs 450 crores in the film and they are spending Rs 25 crores for audio.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ