Advertisementt

తేజూ దారిలో బన్నీ..!

Wed 21st Jun 2017 01:07 PM
allu arjun,dj movie,harish shankar,pooja hegde  తేజూ దారిలో బన్నీ..!
DJ Seetimaar Song's Promo Rocks తేజూ దారిలో బన్నీ..!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్‌ తేజ్‌.. ఈయన తన కెరీర్‌ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ.. ఇలా తన పాటలను, వేడుకలను అందరితో చేస్తూ తన లౌక్యం ప్రదర్శిస్తున్నాడు. చివరకి మంచు ఫ్యామిలీతో కూడా కలిసి తన తెలివిని ఈ మెగా మేనల్లుడు చూపిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ సైతం అదే దారి పట్టాడు. మెగాభిమానులతో నాకేం పని? వారితో అవసరం తీరిపోయింది కదా..! తనకంటూ ఓన్‌ ఫ్యాన్స్‌ వచ్చారు కదా..! అనే ఆలోచనలో ఉన్నాడని తాజాగా విడుదలైన 'డిజె'లోని కొత్తపాట ప్రోమోని చూస్తే అర్ధమవుతోంది. 

తాజాగా యూట్యూబ్‌లో 'సిటీమార్‌' అనే పాటను దిల్‌రాజు విడుదల చేశాడు. ఇది టీవీలలో కూడా హోరెత్తిస్తోంది. ఇందులోని ఒక పదం చూస్తే బన్నీ సాయి దారిలోనే వెళ్తున్నాడని అర్ధమవుతోంది. ఒకవైపు పవన్‌ ప్యాన్స్‌తో గొడవ, బన్నీని క్షమించేందుకు పవన్‌ అభిమానులు సిద్దంగా లేకపోవడం, బన్నీ కూడా మెట్టు దిగకపోవడంతో బన్నీ తాజాగా తన ఫ్యామిలీకి చెందిన హీరోలను పొగుడుతూ తన తెలివి చూపిస్తున్నాడు. 

ఈ కొత్త పాటలో 'ఎన్టీఆర్‌..ఏయన్నార్‌.. మెగాస్టార్‌.. నిన్నే చూస్తే విజులేస్తార్‌..' అని ఉంది. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోలుగానీ నందమూరి అభిమానులు, హీరోలు గానీ ఇతరులను ఇమిటేట్‌ చేయడం, తమ పాటల్లో డైలాగుల్లో ఇతర హీరోల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడతారు. తమదే వంశం, తమదే చరిత్ర, మా ఊరు పాలకొల్లు., కొణిదెల నాయకా... అంటూ తమ ఫ్యామిలీలనే వాడుతుంటారు. 

ఇక బన్నీ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌.. మెగాస్టార్‌ పదాలను వాడటమే కాదు.. వారి స్టెప్స్‌ను కూడా ఇమిటేట్‌ చేస్తుంటే ఆయన ఎంత ముదురు? తన తండ్రి అనుమతి లేకుండానే ఇలా చేశాడా? వంటి పలు అనుమానాలొస్తున్నాయి. మొత్తానికి బన్నీ దేశముదురని అందరికీ అర్ధమవుతోంది. 

DJ Seetimaar Song's Promo Rocks:

Seetimaar song's promo was released which made fans went berserk. Allu Arjun's stylish dance movements gave an impression that it's going to be one of the best dancing numbers in his career. While vocalizing the lyrics NTR, ANR, Megastar, he showed glimpses of dance moves of those heroes.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ