Advertisementt

ఈ పోరు భలే రంజుగా ఉండనుంది..!

Wed 21st Jun 2017 12:28 PM
mahesh babu,balakrishna,paisa vasool,spyder movie,murugadoss,puri  ఈ పోరు భలే రంజుగా ఉండనుంది..!
Balakrishna Competition to Mahesh Babu ఈ పోరు భలే రంజుగా ఉండనుంది..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో ఇప్పటి వరకు మహేష్‌ బాబు ఎప్పుడు నందమూరి బాలకృష్ణతో సినిమా రిలీజ్‌ల్లో పోటీపడలేదు. కానీ యాదృచ్చికమో.. మరేమో తెలియదు గానీ మరో ఆరునెలలో సూపర్‌ స్టార్‌ నందమూరి నటసింహానికి పోటీగా వస్తున్నాడు. ఎంతో కాలంగా షూటింగ్‌ జరుపుకుంటున్న మహేష్‌ బాబు- మురుగదాస్‌ల ప్రతిష్టాత్మక చిత్రం 'స్పైడర్‌' ఎట్టకేలకు సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేస్తారని ఖచ్చితమైన సమాచారం. 

ఈ చిత్రం ద్వారా మహేష్‌ కోలీవుడ్‌లో కూడా స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం మహేష్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో ఠాగూరు మధు, ఎన్వీప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ పూరీ జగన్నాథ్‌తో చేస్తున్న చిత్రం 'పైసా వసూల్‌'. ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తర్వాత జోరు మీదున్నాడు. 

ఇక పూరీ ఫ్లాప్‌లలో ఉండటంతో ఈ చిత్రం అతనికి చావో రేవో తేల్చనుంది. దాంతో పూరీ కూడా ఎంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య హెయిర్‌స్టైల్‌ నుంచి లుక్‌, గెటప్‌, బాడీలాంగ్వేజ్‌, డైలాగ్‌డెలవరీ, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌తో పూరీ ఇందులో బాలయ్యను చూపించనున్నాడు. పూరీ తన మార్కును చూపిస్తే ఇక బాలయ్య అభిమానులకు పండుగే పండుగ. ఇటీవలే పోర్చుగల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని రిలీజ్‌ రోజే ప్రకటించారు. సో.. రెండు రోజుల వ్యవధిలో మహేష్‌, బాలయ్యలు పోటీ పడనున్నారు. 

అదే సమయంలో నిన్న సోమవారం నుంచి మహేష్‌ తాను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌ మొదలైంది. అదే సమయంలో జులై 10 నుంచి బాలయ్య తమిళ సీనియర్‌ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌తో చేసే చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే 'భరత్‌ అనే నేను'కు, బాలయ్య చిత్రానికి ఆయా దర్శకులు పూర్తి మెరుగులుదిద్ది స్క్రిప్ట్‌ను లాక్‌ చేశారు. 

ఈ రెండు చిత్రాలను కూడా ఎలాగైనా ఐదు నెలల్లో పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్‌ అయ్యారు. మహేష్‌ 'భరత్‌ అనే నేను'కు ఆల్‌రెడీ జనవరి 11న రిలీజ్‌ అని చెప్పారు. మరోవైపు బాలయ్య తనకు అచ్చివచ్చిన సంక్రాంతికి వదలకూడదని డిసైడ్‌ అయ్యాడు. దీంతో మహేష్‌, బాలయ్యల ఢీ అంటే ఢీలో ఎవరు పై చేయి సాధిస్తారో వేచిచూడాల్సివుంది..! 

Balakrishna Competition to Mahesh Babu:

So far, Mahesh Babu did not compete with Nandamuri Balakrishna's film releases in his career. In another six months, super star Nandamuri is coming to contest. The exact information that will be released on September 27 is 'Spider'. The exact information that will be released on September 29 is 'Paisa Vasool'. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ