దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'రంగస్థలం 1985'. కాగా ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవల వరకు రాజమండ్రి దగ్గరలోని పల్లెటూర్లు, సరస్సులు, పచ్చని ప్రకృతి సౌందర్యాల వద్ద చిత్రీకరించారు. ఈ చిత్రం 1985 నాటి పీరియాడిక్‌లో రూపొందుతుండటం వల్ల నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఒరిజినల్ లోకేషన్స్‌నే యూనిట్ ఎంచుకుంది.
ఇక నిన్నటిదాకా భయంకరమైన ఎండలో గొడుగు వేసుకుని మరీ చరణ్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుబురు గడ్డం, పంచె, హవాయ్ చెప్పులతో ఆయన హంగామాచేశాడు. ఇక ఆ తర్వాత వానల్లో చిత్రీకరించాల్సిన సీన్స్ కోసం మరలా గోదావరి జిల్లాలకే వెళ్లి అక్కడి ఒరిజినల్ వానల్లో షూటింగ్ చేశారు. ఎండ, మట్టి, గుట్టలు ఉండే ప్రదేశం కాబట్టి చరణ్‌కి కాస్త ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోలేదని యూనిట్ ప్రశంసలు కురిపిస్తోంది.
ప్రస్తుతానికి యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఈ నెలాఖరులోగా 1980-85 నాటి వాతావరణం, అరుగులతో కూడిన ఇళ్లు, వీధుల సెట్స్‌ని వేసి ఓ స్టూడియోలో గోదావరి జిల్లాలలో షూటింగ్ జరపలేకపోయిన సీన్స్‌ని ఇక్కడే చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో చరణ్ ఓ జాలరి పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..!