Advertisementt

ఈసారి పవన్ సినిమాలో వెంకీ..!

Tue 20th Jun 2017 10:07 PM
pawam kalyan,trivikram srinivas,venkatesh,venkatesh in pawan kalyan film  ఈసారి పవన్ సినిమాలో వెంకీ..!
Venkatesh in Pawan Kalyan, Trivikram Film ఈసారి పవన్ సినిమాలో వెంకీ..!
Advertisement
Ads by CJ

'గోపాల గోపాల' చిత్రంలో వెంకటేష్ - పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. వెంకటేష్ తో వున్న అనుబంధంతోనే పవన్ అప్పట్లో 'గోపాల గోపాల' లో చేసాడు. అసలు వెంకటేష్, పవన్ కళ్యణ్ లు మంచి ఫ్రెండ్స్. వీరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే బావుంటుంది అనుకున్న టైంలోనే వీరిద్దరూ 'గోపాల గోపాల'లో కలిసి యాక్ట్ చేసి అభిమానులను అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి పవన్, వెంకీ లు కలిసి కనబడబోతున్నారట.

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కే చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ చిత్రంలో  ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. త్రివిక్రమ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఇలా వెంకీ ని గెస్ట్ రోల్ లో చేసేందుకు ఒప్పించాడట. అలాగే వెంకీ గెస్ట్ రోల్ ఈ చిత్రానికి కీలకం అంటున్నారు. ఇంకా మంచి ఎంటర్టైనింగ్ గా కూడా ఉండబోతుందట. ఇక వెంకీ... పవన్ చిత్రంలో నటిస్తున్నాడని విషయం ఇప్పటివరకు బయటికి పొక్కకుండా చాలా గోప్యంగా ఉంచిన టీమ్ ఈ రోజు వెంకటేష్ తో తెరకెక్కించిన సన్నివేశాలతో విషయం బయటికి వచ్చేసింది.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో  ఇప్పటికే ఖుష్బూ, ఇంద్రజ, కీర్తి సురేష్, అను అమ్మన్యువల్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ కూడా ఈ చిత్రంలో యాడ్ అయ్యాడన్నమాట. 

Venkatesh in Pawan Kalyan, Trivikram Film:

Pawan Kalyan, Trivikram Srinivas new movie is hitting the headlines with some very interesting surprises now and then.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ