ఇప్పుడు రాజమౌళి అంటే తెలియని ఇండియన్ సినీ ప్రేక్షకుడు లేడు. ఇక పలు విదేశాలలో కూడా ఆయన పేరు బాగా వినిపిస్తోందని చెప్పడం అతిశయోక్తేమీకాదు. కాగా రాజమౌళికి 'స్టూడెంట్ నెం1', 'సింహాద్రి' ఇలా మొదటి నుంచే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్ ఉంది. ఆయన తనదైన కాపీరైట్ కింద ఇట్ ఈజ్ ఏ రాజమౌళిస్ ఫిల్మ్ అని స్టాంప్ వేసేంతగా ఆయన కెరీర్ తెలుగులో ఉండేది. పోస్టర్‌పై దాసరి, రాఘవేంద్రరావు, పూరీ వంటి వారిలాగనే ఆయన కూడా మొదటి నుంచి తన బ్రాండ్‌ను వేసుకున్నాడు. తెలుగులో ఆయనకు ఫ్లాప్‌లు లేవుకానీ 'సై' చిత్రం మాత్రం కాస్ట్‌ఫెయిల్యూర్ అని నాటి ఆ చిత్ర నిర్మాత గిరి కొందరు సన్నిహితులకు చెప్పుకొచ్చాడు.
ఇక 'ఈగ'తో రాజమౌళి ఒక్కొక్క అడుగూ వేస్తూ,... నేషనల్ బ్రాండ్ కింద ఎదిగాడు. ఆమధ్య తానే ఓ సొంత నిర్మాణ సంస్థ అని హడావుడి చేసి బేనర్ లోగోకు విశ్వామిత్రుని గెటప్‌లో ప్రభాస్‌తో షూట్ చేసి 'యమదొంగ' తీసి పెద్దగా లాభాలైతే సాధించలేదు. ఆయన భార్య రమ కూడా తనకు నచ్చని ఒకే ఒక్క చిత్రం 'యమదొంగ'అని, అది కేవలం ఎన్టీఆర్ ఇమేజ్‌తోనే ఆడిందని ఓపెన్‌గా చెప్పింది. ఇక నిర్మాతగా వరసపెట్టి చిత్రాలు తీస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత మౌనంగా ఉంటూ తన రేంజ్‌కు తగ్గ నిర్మాతలను ఎంచుకుంటూ, సినిమాలకు కనీస పారితోషికంతో పాటు లాభాలలో వాటాలు తీసుకుంటూ వస్తున్నాడు. అదే ఆయనకు రిస్క్‌లేని వ్యాపారం అనిపించింది.
ఇక 'బాహుబలి' రెండు పార్ట్‌లకు కలిపి తాను లాభాలలో షేర్ తీసుకున్నానని, కానీ ఎంత శాతం అనేది మాత్రం చెప్పలేదు. ఇక 'బాహుబలి' వల్ల ఆయనకు ఊహించని లాభాలు వచ్చాయట. సాధారణంగా సినీఫీల్డ్‌లో మరీ ముఖ్యంగా దర్శకులు, నటీనటులు ఇక్కడ సంపాదించిన సొమ్మునే మరలా ఇక్కడే పెట్టుబడులు పెడుతుంటారు. వాటి ద్వారా లాభపడిన వారికంటే నష్టపోయిన వారే అధికం. చివరకు సుకుమార్ వంటి దర్శకులు కూడా ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే చిన్న సినిమాలలో పెట్టుబడి పెడుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం 'బాహుబలి' ద్వారా వచ్చిన తన వాటాను రియల్‌ఎస్టేట్, పలు భూములతో పాటు తెలంగాణలోని దోనకొండ ప్రాంతంలో ఏకంగా 100ఎకరాలు కొన్నాడట. దానిలో తనకిష్టుడైన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ చేత పెద్ద బంగ్లా కట్టడానికి, ఫౌమ్‌హౌస్‌గా వాడుకొని, కథలు రాసుకోవడం, రిలాక్స్ కోసం వాడనున్నాడట. ఇది ఎన్‌హెచ్9 పక్కనే ఉంది. ప్రస్తుతం అక్కడ పలు పండ్లతోటలున్నాయి.
ఇలా తనకొచ్చిన డబ్బునంతాముందు జాగ్రత్తగా స్ధిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడంతో ఆయన చేతిలో ప్రస్తుతం లిక్విడ్‌క్యాష్ కూడా లేదని సమాచారం. ఇక తాజాగా ఆయన కోటి రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ7 సిరీస్ కారును కొన్నాడు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన చేతిలో లిక్విడ్ క్యాష్ లేదని, రాబోయే కాలంలో (అది ఎప్పుడో కూడ తెలియదు) తనకు బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో కరణ్‌జోహార్ కృతజ్ఞతగా ఆయనకు ఆ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని సమాచారం. ఇది తెలిసిన వారంతా.. వారెవ్వా జక్కన్నా.. నీ సినిమా విజనే కాదు.. రియల్‌లైఫ్ విజన్ కూడా అద్భుతంగా ఉంది అంటూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంట!