Advertisementt

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య మనసు మారింది!

Tue 20th Jun 2017 08:34 PM
balakrishna,mokshagna entry,tollywood,aditya 369,singeetham sreenivasa rao  మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య మనసు మారింది!
Balakrishna Thinking on Mokshagna Entry మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య మనసు మారింది!
Advertisement
Ads by CJ

నందమూరి వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఇంకా సస్పెన్సు కొనసాగుతూనే వుంది. గత ఏడాదే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన మోక్షజ్ఞ ఇప్పుడు చడీ చప్పుడు చెయ్యడం లేదుగాని.... బాలకృష్ణ మాత్రం ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నాడనే టాక్ వినబడుతుంది. చాలామంది దర్శకులతో బాలకృష్ణ చర్చలు జరుపుతున్నాడని.... వీరందరిలో సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అయితే మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే విషయంలో కేర్ తీసుకుంటాడని ఉద్దేశ్యంతో బాలయ్య ఆ పనిని సింగీతం శ్రీనివాసరావు కు అప్పగిస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది.

మరి ఇండస్ట్రీకి గ్రాండ్ లాంచ్ చేయాలంటే ఒక మాస్ సినిమా అయితే సాధ్యం అవుతుందని కూడా బాలకృష్ణ భావించినట్లు వార్తలొచ్చాయి. అందుకు అనుగుణంగానే మోక్షజ్ఞ కూడా మంచి బాడీ కోసం  తెగ వర్కవుట్స్ చేస్తున్నాడట. కాకపోతే ఇప్పుడు బాలకృష్ణ ఆలోచనలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. మోక్షజ్ఞ ని మొదటి సినిమాతోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించకుండా చాలా సింపుల్ గా అంటే ఒక చిన్న సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఉన్నాడని అంటున్నారు.

అందుకే మోక్షజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్ గా సింగీతం శ్రీనివాసరావు ని తప్పించి.... మోక్షజ్ఞ  రెండో సినిమాని సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో చేయించాలని చూస్తున్నారట. మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఏ మాత్రం హైప్ క్రియేట్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీనుకుంటున్నాడట బాలయ్య బాబు. భారీ ఫైట్స్, భారీ డైలాగ్స్ గట్రా లేకుండా చాలా సింపుల్ కథతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ వుంటుందని.... వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కాబోతుందని...త్వరలోనే సినిమాకి సంబందించిన అన్ని విషయాలు బాలకృష్ణే స్వయంగా తెలియజేస్తారని చెబుతున్నారు.

Balakrishna Thinking on Mokshagna Entry:

Shocking Twist in Balakrishna Son Mokshagna Entry to Tollywood Industry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ