Advertisementt

అక్షర సత్యం చెప్పిన మెగాస్టార్‌..!

Tue 20th Jun 2017 02:45 PM
chiranjeevi,k viswanath,sp balu,fncc  అక్షర సత్యం చెప్పిన మెగాస్టార్‌..!
Mega Star Chiranjeevi Says Alphabetical Truths అక్షర సత్యం చెప్పిన మెగాస్టార్‌..!
Advertisement
Ads by CJ

చంద్రునికో నూలుపోగు... జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా.. అనే సామెతలను తరచుగా మన పెద్దవారు చెప్పేవారు. అవార్డులనేవి కెరీర్‌ ప్రారంభంలో వస్తే వాటికున్న ప్రాధాన్యమే వేరు. అవార్డులు, సన్మానాలు అనేవి వారికి ఎంతో స్ఫూర్తినిచ్చి ముందుకు నడుపుతాయి. కానీ ఘనాపాఠిలకు, అతిరథ మహారధులకు అవి వస్తే అందరికీ ఆనందమే గానీ కెరీర్‌ చివర్లోనో, చనిపోయిన తర్వాతనే, లోకాన్ని మొత్తం చుట్టి వచ్చిన వారికి అవి పెద్ద ముఖ్యం కాదు. 

అందుకే తరచుగా పలు అవార్డులను ప్రకటిస్తున్నప్పుడు పెద్దపెద్ద లెజెండ్స్‌కి వస్తే వాటిని కొత్తవారికి ఇస్తే ఉపయోగం.. వయసయిపోయిన వారికి, రాటుదేలిన వారికి అవి ఎంత వరకు సంతృప్తినిస్తాయి? అనే వాదన ఎప్పటినుంచో వచ్చింది. చిరంజీవికి లెజెండ్‌ ఇస్తే, లెజెండ్‌కు సెలబ్రిటీకి తేడాను అడిగి రచ్చ చేసిన వారు ఉన్నారు. అందుకే ఎన్నోసార్లు అమితాబ్‌, కమల్‌, రజినీ తరహా వారు అవార్డులు వస్తే మనకెందుకు అవ్వన్నీ అంటారు. 

ఆస్కార్‌ రాలేదే అంటే అదేమైనా పెద్ద కిరీటమా? అది వస్తేనే మేము గొప్పా? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఇక గత ఎన్నోఏళ్లుగా మన ప్రభుత్వాలు భారతరత్న నుంచి పద్మ అవార్డులు, రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులను చనిపోయిన తర్వాత ఇస్తున్నారు బతికున్నప్పుడు ఇవ్వని గౌరవం దేనికీ ఉపయోగంలేదు. తన కెరీర్‌లో కృష్ణకి పెద్దగా అవార్డులే రాలేదంటే పరిస్థితిని మనం అర్ధం చేసుకోవచ్చు. 

తాజాగా తెలుగు పరిశ్రమ కె.విశ్వనాథ్‌ని, బాలుని సన్మానించింది. ఈ సందర్భంగా చిరు చేసిన వ్యాఖ్యలు వాస్తవం. ఇలాంటివి చేయకూడదని కాదు గానీ ఇవి వారికి నూలు పోగుతో సమానం అనేశాడు. ఇక కె.విశ్వనాథ్‌ కేవలం అవార్డు వచ్చిందని ఇక్కడికి రాలేదని, కేవలం మీె కాశీనాధుని విశ్వనాథ్‌గానే వచ్చానని తన హుందా చాటుకున్నారు. తనకు సినిమాలతో ఉన్న 51ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాలు కె.విశ్వనాథ్‌గారి పక్కన కూర్కోవడమే ఓ అనుభూతి అని చెప్పారు. మొత్తానికి వారందరూ వాస్తవాలు చెప్పారు. కొందరికి ఇవి రుచించకపోవచ్చు. 

Mega Star Chiranjeevi Says Alphabetical Truths:

The recently Telugu film industry has celebrated K. Viswanath and  SP Balu. Chiru the comments made by this are true. Not that they do not do it, but they are equal to them. K.Vishwanath has not come here just because the award has come and that he has just come to know that you have come here as Vishwanath.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ