యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి ఉన్న ఇమేజ్, క్రేజ్, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మరలా చెప్పాల్సిన పనిలేదు. ఫైట్స్‌తో యాక్షన్ సీన్స్ ఇరగదీస్తాడు. స్టెప్స్‌తో, అద్భుతమైన స్కిల్స్‌తో సాంగ్ స్థాయిని పీక్స్‌కి తీసుకెళ్తాడు. ఇక ఎమోషనల్ సీన్స్ ఆయనకు కొట్టిన పిండి. 'ఆది' చిత్రంలోనే తన బాబాయ్ చనిపోయినప్పుడు ఏడ్చే సీన్‌తో వారెవ్వా.. అనిపించాడు.
ఆ తర్వాత 'నా అల్లుడు, యమగొంగ, అదుర్స్‌లోని చారి' పాత్రలలో తనలోని డైలాగ్ మార్కింగ్‌ని, బాడీలాంగ్వేజ్‌ను, చిలిపి చేష్టలను, కామెడీని అదరగొట్టాడు. 'రాఖి' చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్‌ను పండించాడు. ఇక ఆయన ఎలాంటి పౌరాణిక, సాంఘిక పెద్ద పెద్ద డైలాగులనైనా సరే.. సింగిల్ టేక్‌లో ఓకే చేయగలనని 'యమదొంగ, టెంపర్'తో నిరూపించాడు. మరోవైపు 'నాన్నకు ప్రేమతో'తో ఫాదర్ సెంటిమెంట్‌ని, 'స్టూడెంట్‌నెంబర్1'లోనే స్నేహితుల సెంటిమెంట్‌ను, 'జనతాగ్యారేజ్'లో టిపికల్ క్యారెక్టర్‌కి జీవం పోశాడు.
'బృందావనం' కొత్తగా ట్రై చేసినా.. ఇప్పటివరకు ఈ చిన్న కృష్ణుడు తనలోని పూర్తి రొమాంటిక్, చిలిపిదనాన్ని పూర్తి స్థాయిలో చూపించలేదన్నది మాత్రం వాస్తవం. కానీ ప్రస్తుతం ఆయన హోస్ట్ చేస్తోన్న 'బిగ్‌బాస్' ప్రోమో అదరగొడుతోంది. ఇందులో ఆయన అమ్మాయిలు మీద పడుతుంటే.. కన్నుగీటే ప్లేబోయ్ తరహాలో దర్శనమిస్తూ ఓ ఊపు ఊపుతున్నాడు. ఈ సమయంలో ఎన్టీఆర్‌కు పూర్తి రొమాంటిక్ చిత్రం సరైన దర్శకుడి చేతిలో పడితే రికార్డుల మోత ఖాయమంటున్నారు.