నేటి రోజుల్లో ఓ హీరోయిన్ పదేళ్లపాటు స్టార్‌గా వెలుగొందటం రేర్ రికార్డు కిందే చెప్పాలి. పదిలోపు చిత్రాలకే బోరు కొట్టిస్తున్న భామలకు ధీటుగా దశాబ్దం పాటు కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్‌గానే వెలుగొందుతుండటం విశేషం. ఈరోజు (జూన్ 19) ఆమె పుట్టినరోజుతో పాటు మరో విశేషం కూడా ఉంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 50వ చిత్రాన్ని ప్రస్తుతం ఆమె చేస్తోంది. అదే తేజ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న 'నేనే రాజు.. నేనే మంత్రి' చిత్రం.
విశేషం ఏమిటంటే తేజ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీకళ్యాణం' ద్వారానే ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రం హీరో కళ్యాణ్‌రామ్. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం 'ఎంఎల్‌ఎ' (మంచి లక్షణాలున్న అబ్బాయి)లో కూడా ఆమె ప్రస్తుతం నటించనుంది. ఇక తన 10ఏళ్ల కెరీర్‌లో ఆమె దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళంలో, హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు హీరొయిన్‌గా బ్రేక్‌నిచ్చిన చిత్రం 'చందమామ'. ఇక ఆమె కెరీర్‌లో నటించిన అత్యద్భుత చిత్రం 'మగధీర'. ఇందులో యువరాణి మిత్రవిందగా ఆమెను కలకాలం గుర్తుంచుకుంటారు.
ఇక అదే సమయంలో ఆమె చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో నటించింది. మరోపక్క పవన్‌తో 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో పాటు, మహేష్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా అందరితోనూ ఆమె జత కట్టడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ భామ తన కెరీర్‌లో సెంచరీ సాధిస్తుందేమో చూడాలి...!