గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గౌతమ్ నంద’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. జె. భగవాన్, జె. పుల్లారావులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ థెరిస్సాలు నటిస్తున్నారు. ఈ మధ్యన చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘గౌతమ్ నంద’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన ‘గౌతమ్ నంద’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తిని రేకెత్తించడమే కాదు అదిరిపోయే లెవల్లో జరిగిందని సమాచారం.
‘గౌతమ్ నంద’ నైజాం హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. అయితే ఈ నైజాం హక్కులును టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు 6.30 కోట్లు వెచ్చించి భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్య ఏరియాల హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. దుబాయ్ వంటి ఖరీదైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉండడంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయిందని టాలీవుడ్ లో వినిపిస్తుంది.