గతంలో అందరూ స్వర్గీయ ఎన్టీఆర్ స్టైల్‌ని, మేనరిజమ్స్‌ని, స్టెప్స్‌ని ఫాలో అయ్యేవారు. ఆయనలాగా, ఎన్టీఆర్‌లాగా ప్యాంట్లు, షర్ట్స్, క్రాఫ్‌లు చేసుకునే వారు. వారి తర్వాత ఆ స్థానం చిరుకి దక్కింది. చిరంజీవి 'జగదేకవీరుడు-అతిలోక సుందరి' చిత్రంలో వేసిన బ్యాగీప్యాంట్లు నుంచి ఎన్నో పాపులర్ అయ్యాయి. ఆయన డైలాగ్ డెలివరినీ, క్రాఫ్‌ని, స్టెప్స్‌ను, తాగుడు సీన్స్‌ని ఇమిటేట్ చేశారు.
'గ్యాంగ్‌లీడర్' సమయంలో ఆయన ధరించిన చొక్కాలు బాగా ఫాలో అయ్యారు. ఇక పవన్ కళ్యాన్‌ని యూత్ ఐకాన్‌గా చెప్పవచ్చు. 'తొలిప్రేమ'లో ఆయన పంచెకట్టిన విధానం, తమ్ముడులో ఆయన పంచెను అనుకరించి, నోటీలో బీడీతో చేసిన సీన్స్‌ని తాజాగా నితిన్ కూడా ఫాలోఅవుతున్నాడు. రామ్‌ది కూడా అదే బాట. ఇక 'గుడుంబా శంకర్' తదితర చిత్రాలలో పవన్ వేసుకున్న ప్యాంటు మీద ప్యాంటు నుంచి అన్ని ఫాలోఅయ్యారు.
ఇక 'నాన్నకు ప్రేమతో'లో ఎన్టీఆర్ హెయిర్‌స్టైల్ ఫేమస్ అయిపోయింది. ఇక 'శ్రీమంతుడు'లో మహేష్, 'మిర్చి'లో ప్రభాస్‌ని కూడా చాలా మంది అనుకరించారు. ఇక తాజాగా సుకుమార్ చిత్రంలో రామ్ చరణ్ శంఖు మార్క్ లుంగీ, గుబురు గడ్డం, హవాయ్ చెప్పులు లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ 'రంగస్థలం'తో చరణ్ యూత్‌లో ఏ మార్కు సెట్ చేస్తాడో చూడాల్సివుంది...!