కమల్ హాసన్.. గత ఏడాదిన్నరగా ఆయన కనిపించలేదు. ఆయన నటించి, తెలుగులో విడుదలైన చివరి చిత్రం 'చీకటి రాజ్యం'. ఇక ఆయన బ్రహ్మానందంతో కలిసి నటిస్తు, దర్శకత్వం వహించిన 'శభాష్ నాయుడు' షూటింగ్‌లో గాయపడ్డాడు. తమిళంలో 'పాప నాశనం' చేశాడు. ఇది 'దృశ్యం'కు రీమేక్. ఒక ఆయన నటించిన అందరినీ అలరించిన చివరి చిత్రం 'విశ్వరూపం1'. అది కూడా కమల్ రేంజ్ విజయం కాదు.
'ఉత్తమ విలన్'గా అన్నింటిలోనూ ఈమధ్య బాగా ఇబ్బంది పెడతున్నారు. ఇక ఆయన తన విశ్వరూపం 2 ఆగిపోయింది, నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ చేతులెత్తేశాడు. చివరకి ఇప్పుడు కమల్ మరలా దానిని టేక్ చేశాడు. ప్రస్తుతం చిన్న ప్యాచ్ వర్క్ టర్కీలో జరుగుతోంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 28న రంజాన్ కానుకగా విడుదల చేయనున్నారు.
కమల్ 'విశ్వరూపం1'కు విడుదలకు ముందే ముస్లిం వర్గాల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమైన నేపధ్యంలో తన 'విశ్వరూపం2' టీజర్‌ని రంజాన్‌కి విడుదల చేయడం గమనార్హం. మొదటి పార్ట్ వరల్డ్ టెర్రరిజం నేపధ్యంలో సాగగా, 'విశ్వరూపం2' ఇండియన్ టెర్రరిజం మీద నడవనుంది. సో.. ఈ చిత్రం కూడా అందరినీ మొదటి పార్ట్ కంటే ఎక్కువగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.