కాజల్ గర్భవతి అంట. ఈ గాసిప్ సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తుంది. తన చెల్లెలికి తన కంటే ముందే పెళ్ళి చేసిన కాజల్..తను మాత్రం పెళ్ళికి కొంత టైమ్ పెట్టుకుంది. తను ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చినా..కాజల్..ఇదే మాట చెబుతూ వస్తుంది. ఆ టైమ్ రాగానే అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్న కాజల్‌పై తాజాగా ఇలాంటి రూమర్స్ రావడం నిజంగా బాధాకరమే.
ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న కాజల్..గర్భవతి అంటే ఎలా నమ్మేది? ఈ విషయం కాజల్‌కి కూడా తెలిసిందట. కానీ ఇలాంటి సిల్లీ గాసిప్స్‌కి స్పందిస్తే..ముందు ముందు ఇంకా ఇలాంటివి క్రియేట్ చేస్తారని భావించి..నవ్వుకుని వదిలేసిందట. అందుకే దీని గురించి లైట్ తీసుకుని తన షూటింగ్‌లో నిమగ్నమైందట.
అయితే ఇప్పుడు, ఈ టైమ్‌లో కాజల్‌పై ఇలాంటి వార్తలు క్రియేట్ చేసే అవకాశం ఎవరికి ఉంది అని ఇండస్ట్రీలో ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె పొజిషన్ కూడా ఏమంత పోటీగా లేదు. తన తోటి హీరోయిన్‌లు కావాలని ఇలా చేశారని చెప్పుకోవడానికి. తనని ప్రేమించిన వాడు చేసిన పని అని చెప్పుకోవడానికి..తనకి ఎవరూ లవర్స్ లేరని కాజల్ చెప్పుకోస్తుంది. నిప్పు లేనిదే పొగ రాదు..అని సామెతని వర్తింపచేయడానికి కూడా అస్సలు అక్కడ విషయం లేదని అందరికీ తెలిసిందే. మరి ఈ రూమర్ వెనుక ఎవరి హస్తం ఉండి ఉంటుందబ్బా..!?